దేశంలో నిన్నటి (మే 4) నుంచి లాక్‌డౌన్ 3.0 ప్రారంభమైంది. కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి వల్ల పొడిగించిన లాక్‌డౌన్ మే 17వరకు కొనసాగనుంది. తాజా గడువు పొడిగింపులో భాగంగా మద్యం దుకాణాలకు సైతం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడు, తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించాయి. భార్యను బెదిరించబోతే ప్రాణం పోయింది
దాదాపు నెలన్నర తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందు బాబులు షాపుల వద్ద ఎగబడుతున్నారు. కరోన కారణంగా మద్యం షాపులు మూతపడ్డ కారణంగా అధిక ఆధాయం కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎమ్మార్పీ కంటే 70 శాతం అధికంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ‘స్పెషల్ కరోనా ఫీ’ విధించడం వల్ల రూ.1000 ఉన్న సీసా ధర అమాంతం రూ.1700 అవుతుంది. వారి బౌలింగ్ అంటే రోహిత్‌కు నిద్ర పట్టదు
సోమవారం రాత్రి కేజ్రీవాల్ కేబినెట్ మీటింగ్ నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యం అమ్మకాలపై పడిపోయిన ఆదాయాన్ని పెంచడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం స్పెషల్ కరోనా ఫీని మద్యంపై విధించింది. అసలే ఉచిత సరుకులు ఇస్తున్నార్న తీరుగా మద్యం షాపుల వద్ద మందు బాబులు సోమవారం దేశ వ్యాప్తంగా హల్ చల్ చేయడం చూశాం. సోషల్ డిస్టాన్స్ అన్న పదమే తెలియదన్నట్లుగా వైన్ షాపుల వద్ద గుమిగూడటం ఆందోళన కలిగిస్తోంది. నటి పూజా ఝవేరి లేటెస్ట్ ఫోటోస్
భారీగా పెంచిన ధరలు మద్యం ద్వారా ఆదాయం పెంచడంతో పాటు మందుబాబుల జోరును కూడా కాస్త తగ్గిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ భావిస్తోంది. దీంతో సామాజిక దూరంతో పాటు మద్యం ఆదాయం పెంచి ఆర్థిక లోటును భర్తీ చేయాలని ఢిల్లీ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
కరోనా ట్యాక్స్: మందుబాబులకు భారీ షాక్