Delhi New Rules: ఢిల్లీలో ఇక నుంచి ప్రైవేటు ఆఫీసులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి

Delhi New Rules: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మినహాయింపు పొందిన కొన్ని ఆఫీసులు తప్ప.. మిగిలిన అన్ని ప్రైవేటు ఆఫీసులు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2022, 02:09 PM IST
Delhi New Rules: ఢిల్లీలో ఇక నుంచి ప్రైవేటు ఆఫీసులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి

Delhi New Rules: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మినహాయింపు పొందిన కొన్ని ఆఫీసులు తప్ప.. మిగిలిన అన్ని ప్రైవేటు ఆఫీసులు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 

కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా సంక్రమణ భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (Delh Disaster Management Authority) కీలక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసింది. 

దేశ రాజధాని ఢిల్లీలో అమల్లో ఉన్న ఎల్లో అలర్ట్ ప్రకారం 50 శాతం సిబ్బందితో ప్రైవేటు ఆఫీసులు పనిచేసేందుకు అనుమతి ఉంది. కొత్త నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన ఆఫీసులు మినహాయించి..మిగిలినవి వర్క్ ఫ్రం హోం (Work from Home) అమలు చేయాల్సి ఉంటుంది. ఢిల్లీలో రెస్టారెంట్లలో భోజనం నిన్నటి నుంచి ఆగిపోయింది. కేవలం హోం డెలివరీకే అనుమతి ఉంటుంది. గత 24 గంటల్లో డిల్లీలో 20 వేల కేసులు నమోదవడంతో పాటు 17 మంది మరణించారు. 

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్రలు ముందు వరుసలో ఉన్నాయి. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి. డీడీఎంఏ మార్గదర్శకాల ప్రకారం కొత్త నిబంధనలు (New Restrictions) ఇకపై అమలు కానున్నాయి.

Also read: Tihar Jail Corona: తిహార్ జైల్లో కరోనా కలకలం... 76 మందికి పాజిటివ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News