Air Pollution in Delhi : ఢిల్లీలో డేంజర్ బెల్స్... అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం...

సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) జీరో నుంచి 50 వరకు ఉంటే.. అక్కడ గాలి నాణ్యత బాగున్నట్లు పరిగణిస్తారు.ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451గా ఉండటంతో నగరం ప్రమాదపు అంచుల్లోకి చేరినట్లయింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2021, 01:26 PM IST
  • ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం
  • ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451గా నమోదు
  • బాణసంచాపై నిషేధాన్ని పట్టించుకోని ప్రజలు
  • పెరిగిన కాలుష్యంపై సర్వత్రా ఆందోళన
Air Pollution in Delhi : ఢిల్లీలో డేంజర్ బెల్స్... అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం...

Delhi Air Quality Index Worsen due to Diwali: ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. దీపావళి రోజు బాణసంచా కాల్చడంపై ప్రభుత్వ నిషేధం విధించినా ప్రజలు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. శుక్రవారం(నవంబర్ 5) తెల్లవారుజామున దట్టమైన పొగ నగరాన్ని ఆవరించింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ,వెదర్ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఉదయం 8గంటల సమయంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451గా నమోదైంది.గాలి నాణ్యత ఇంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) జీరో నుంచి 50 వరకు ఉంటే.. అక్కడ గాలి నాణ్యత బాగున్నట్లు పరిగణిస్తారు. 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరంగా ఉందని,101-200 వరకు ఉంటే ఓ మోస్తరుగా ఉన్నట్లు పరిగణిస్తారు.

Also Read: SURIYA JAI BHIM: హీరో సూర్యపై BJP నేత సంచలన వ్యాఖ్యలు.. సూర్య రియాక్షన్ అదుర్స్

అదే 201-300 వరకు ఉంటే అక్కడ గాలి నాణ్యత బాగాలేదని పరిగణిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 301-400 మధ్య ఉంటే అది అద్వాన్నమైన స్థితిగా,401-500గా ఉంటే ప్రమాదకర స్థితిగా పరిగణిస్తారు.ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451గా ఉండటంతో నగరం ప్రమాదపు అంచుల్లోకి చేరినట్లయింది. ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై ఇది తీవ్ర దుష్ప్రభావం చూపవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫరీదాబాద్‌లో 454గా,గ్రేటర్ నోయిడాలో 410గా,ఘజియాబాద్‌లో 438గా,గుర్గావ్‌లో 473గా నమోదైంది.

Also Read: Gold Smuggling News: విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో రూ.1.91 కోట్ల విలువైన అక్రమబంగారం పట్టివేత

ఢిల్లీలో వాయు కాలుష్యంపై భారత వాతావరణ శాఖ(IMD) అధికారి ఆర్కే జనమణి మాట్లాడుతూ... నగరంలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు.ప్రజలు బాణసంచా కాల్చడం,బయో మాస్ కాలుష్య కారకాలే ఇందుకు కారణమన్నారు. అయితే వాయు వేగం పెరిగితే ఇప్పుడున్న పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుందన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News