Delhi AIIMS Fire Out Break: ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో భారీగా మంటలు చెలరేగాయి. ఎండోస్కోపీ విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుండగా.. 8 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎయిమ్స్‌లోని రోగులను, ప్రజలను తీసుకువస్తున్నారు. మంటలు భారీగా ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. ఎమర్జెన్సీ వార్డుపై మంటలను ఆర్పివేయగా.. అందులోని రోగులను వార్డు నుంచి బయటకు తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఎండోస్కోపీ గది పాత ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) రెండవ అంతస్తులో ఉంది.
సోమవారం ఉదయం 11.54 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. అగ్నిమాపక దళానికి చెందిన 8 వాహనాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Delhi: A fire broke out in the endoscopy room of AIIMS. All people evacuated.
More than 6 fire tenders sent, say Delhi Fire Service
Further details are awaited. pic.twitter.com/u8iomkvEpX
— ANI (@ANI) August 7, 2023
జూన్ 2021న కూడా ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఎయిమ్స్ గేట్ నంబర్ 2 సమీపంలోని కన్వర్షన్ బ్లాక్‌లోని తొమ్మిదో అంతస్తులో మంటల చెలరేగాయి. రాత్రి 10 గంటల సమయంలో మంటలు చెలరేగగా.. దాదాపు 26 వాహనాలు అర్థరాత్రి మంటలను అర్పివేశాయి. ఈ అగ్నిప్రమాదంలో కరోనా ల్యాబ్‌లో ఉంచిన పరికరాలు కాలి బూడిదయ్యాయి.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి లైన్ క్లియర్.. పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ
Also Read: CM Jagan Mohan Reddy: రూ.10 వేల సాయంపై సీఎం జగన్ కీలక ప్రకటన.. సచివాలయంలో అర్హుల జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి