Mumbai: గ్యాస్ సిలిండర్ పేలి.. 20 మందికి తీవ్ర గాయాలు

మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు.

Last Updated : Dec 6, 2020, 11:54 AM IST
  • ముంబైలోని లాల్‌బాగ్‌ ప్రాంతంలోని ఓ నివాసంలో ఆదివారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది.
  • బిల్డింగ్ మొత్తం మంటలు తీవ్రంగా వ్యాపించడంతో 20 మంది గాయపడ్డారు.
  • గాయపడిన వారిని హుటాహుటిన కింగ్ ఎడ్వర్ట్ ఆసుపత్రికి తరలించారు.
Mumbai: గ్యాస్ సిలిండర్ పేలి.. 20 మందికి తీవ్ర గాయాలు

Major cylinder blast at Mumbai's Lalbaug area: ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం ( fire accident ) సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ముంబైలోని లాల్‌బాగ్‌ ప్రాంతంలోని ( Mumbai's Lalbaug area) ఓ నివాసంలో ఆదివారం ఉదయం గ్యాస్ సిలిండర్ ( gas cylinder blast ) పేలింది. బిల్డింగ్ మొత్తం మంటలు తీవ్రంగా వ్యాపించడంతో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారందరిని హుటాహుటిన కింగ్ ఎడ్వర్ట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Also read: Bharat Bandh: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ప్రమాదం జరిగిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు రెండు అగ్నిమాపక దళాలతో పాటు రెండు జంబో ట్యాంకర్లను పంపించినట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ( BMC ) అధికారులు తెలిపారు. అయితే ముందుగా బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని, ఈ మంటలవల్ల సిలిండర్ పేలిందని అధికారులు పేర్కొంటున్నారు. గాయపడిన వారిని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇంకా అగ్నమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.  Also read: Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీతోపాటు 518 మందిపై కేసు

 

Also read: Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News