Cyclone Biparjoy Live Updates: బిపోర్ జాయ్ భయపెడుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాన్.. బలహీనపడి తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో దక్షిణాది నుంచి ఉత్తర భారతదేశం వరకు ఎక్కడికక్కడ వాతావరణం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా నార్త్ రాష్ట్రాల ప్రజలను తేమతో కూడిన వేడి ఇబ్బంది పెడుతోంది. అదేవిధంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. గత 24 గంటలల్లో దక్షిణ గుజరాత్, కేరళ, అండమాన్-నికోబార్ దీవులు, ఈశాన్య బీహార్, తీర ఒడిశా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈశాన్య భారతదేశం, సిక్కిం, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ అంతర్గత కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, కొంకణ్, గోవాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
గుజరాత్, జమ్మూ కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, లక్షద్వీప్‌లలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో గుజరాత్ తీరం వెంబడి సముద్రం చాలా ఉధృతంగా ఉంటుందని చెబుతున్నారు. రేపటి వరకు గుజరాత్ తీరంలో ఉరుములతో కూడిన బలమైన గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 90 నుంచి 100 లేదా 120 నుంచి 140 కిలోమీటర్ల వరకు వీస్తాయని తెలిపారు. గుజరాత్ దక్షిణ తీరంలో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందన్నారు.
బుధవారం జార్ఖండ్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య భారతదేశం, అండమాన్-నికోబార్ దీవులు, కేరళలోని కొన్ని ప్రాంతాలు, కోస్టల్ కర్ణాటక, కొంకణ్, గోవా, సిక్కింలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
బిపోర్ జాయ్ తుఫాన్ ప్రభావంపై మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ముప్పును ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్ట జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కచ్, సౌరాష్ట్ర నుంచి దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి