Gold Smuggling: అమృత్‌సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Gold Smuggling: బంగారం అక్రమ రవాణాకు విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని పట్టుబడుతుంటే మరికొందరు తప్పించుకుని యధేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అమృత్‌సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2021, 08:49 PM IST
  • అమృత్ సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
  • 822 గ్రాముల బంగారాన్ని క్యాప్యూల్స్ ఆకారంలో తరలిస్తుండగా పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
  • పట్టుబడిన బంగారం విలువ 38 లక్షల రూపాయలుంటుందని అంచనా
 Gold Smuggling: అమృత్‌సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Gold Smuggling: బంగారం అక్రమ రవాణాకు విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని పట్టుబడుతుంటే మరికొందరు తప్పించుకుని యధేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అమృత్‌సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.

బెంగళూరు, తిరువనంతపురం, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల తరువాత ఇప్పుడు అమృత్‌సర్ విమానాశ్రయం(Amritsar Airport)చేరింది. బంగారం అక్రమ స్మగ్లింగ్‌కు అక్రమార్కులు అన్ని అనువైన మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరు తప్పించుకుని యధేఛ్ఛగా బంగారాన్ని స్మగుల్(Gold Smuggling) చేస్తుంటే..మరికొందరు పట్టుబడుతున్నారు. ఇటీవల చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం విమానాశ్రయాల్లో పెద్దమొత్తంలో బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. 

ఈసారి అమృత్‌సర్‌లోని శ్రీగురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు(Customs Officers) పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 822 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(Gold Seized) చేసుకున్నారు. భద్రతా సిబ్బందిని కళ్లుగప్పేందుకు మూడు ప్లాస్టిక్ కవర్లలో క్యాప్సూల్స్ ఆకారంలో బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. ఎయిర్ ఇడియా విమానం నెంబర్ 930లో దుబాయ్ నుంచి అమృత్‌సర్ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణీకుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు ప్రశ్నించినప్పుడు ఈ వ్యవహారమంతా బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 38 లక్షలుంటుందని అధికారులు తెలిపారు. గతంలో అంటే ఆగస్టు 24వ తేదీన కూడా షార్జా నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఓ వ్యక్తి నుంచి 78 లక్షల విలువచేసే 16 వందల కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also read: ICAI CA INTER RESULTS 2021: ICAI CA ఇంటర్ ఫలితాల వెల్లడి, మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News