Coronavirus New Strain Updates In India | న్యూఢిల్లీ: దేశంలో ఓ వైపు కోవిడ్-19 మహమ్మారి కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండగా.. మరోవైపు కొత్తరకం కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశంలో కొత్తరకం కరోనావైరస్ కేసుల సంఖ్య 90కి చేరింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో తాజాగా మరో 8 మందికి బ్రిటన్ స్ట్రైయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి వరకు దేశంలో కొత్త రకం (New strain of COVID-19) కరోనా కేసుల సంఖ్య 82 వరకు ఉంది. తాజాగా నమోదైన కేసులతో దీని సంఖ్య 90కి చేరినట్లు కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) శనివారం వెల్లడించింది. Also Read: India Covid-19: కొత్తగా 18,222 కరోనా కేసులు
అయితే కోవిడ్ న్యూ స్ట్రెయిన్ (Coronavirus) బారిన పడిన వారందరినీ ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఐసొలేషన్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారితో సన్నిహిత సంబధాలున్న వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి భారత్‌కు శుక్రవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకావడంతో న్యూ స్ట్రేయిన్‌పై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Also Read: Covid-19 Vaccine: 11న సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook