Covaxin Universal vaccine: యూనివర్సల్​ వ్యాక్సిన్​గా భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్'!

Covaxin Universal vaccine: దేశీయంగా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్​ మరో ఘనతను సాధించింది. తాజాగా ఇది యూనివర్సల్ వ్యాక్సిన్​గా అవతరించినట్లు భారత్​ బయోటెక్ ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 11:39 PM IST
  • కొవాగ్జిన్ మరో ఘనత
  • యూనివర్సల్​ వ్యాక్సిన్​గా అవతరణ
  • పిల్లలు, పెద్దలకు వినియోగంలో ఉండటమే కారణం
  • వెల్లడించిన భారత్ బయోటెక్
Covaxin Universal vaccine: యూనివర్సల్​ వ్యాక్సిన్​గా భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్'!

Covaxin Universal vaccine: హైదరాబాద్​కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ 'కొవాగ్జిన్​' మరో ఘనతను సాధించింది. ఈ వ్యాక్సిన్​ను యూనివర్సల్ వ్యాక్సిన్​గా (Covaxin now universal vaccine) ప్రకటించింది భారత్ బయోటెక్​. చిన్నారులు, వయోజనులు ఇద్దరికీ ఈ టీకా ఇస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన (Covaxin for adults, children) చేసింది.

దీనితో కొవిడ్ 19కు యూనివర్సల్ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేయాలన్న తమ లక్ష్యం నెరవేరినట్లు భారత్ బయోటెక్ గురువారం ఓ ప్రకటనలో (Bharat biotech COVAXIN Update,) తెలింది.

కొవిడ్ 19 వేరియంటు అయిన డెల్టా, ఒమిక్రాన్​ల పైనా కొవాగ్జిన్ సమర్థంగా పని చేయగలదని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇంతకు ముందు జరిగిన అధ్యాయనాలు.. కరోనా ఆల్ఫా, బీటా, డెల్టా, జిటా, కప్ప వేరియంట్లను కొవాగ్జిన్ నిర్వీర్యం చేయగలదని నిర్ధారించినట్లు గుర్తు (Covaxin efficacy) చేసింది.

రెగ్యులర్ మార్కెట్ అనుమతులకోసం దరఖాస్తు..

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్​కు దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు ఉన్న నేపథ్యంలో.. ఈ రోజు ఉదయమే కొవాగ్జిన్​కు రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇవ్వాలని కోరుతూ డ్రంగ్​ కెట్రోలర్ జనరల్ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకుంది భారత్ బయోటెక్​.

ఈ దరఖాస్తులో వ్యాక్సిన్​ కోసం ఉపయోగించిన రసాయనాలు, తయారీ, క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సహా అవసరమైన అన్ని వివరాలను సమర్పించినట్లు భారత్ బయోటెక్​ పేర్కొంది. 

అయితే ఈ సంస్థ ఇంకా క్లినికల్ ట్రయల్స్​కు సంబంధించి మరింత సమాచారం సమర్పించాల్సి ఉందని డీసీజీఐ వర్గాలు ద్వారా తెలిసింది.

ఇక దేశంలో అత్యవసర వినియోగంలో ఉన్న మరో కొవిడ్ వ్యాక్సిన్​ కొవిషీల్డ్​కు కూడా రెగ్యులర్ మార్కెట్ అనుమతులు ఇవ్వాలని సీరమ్​ సంస్థ డీసీజీఐకు గత ఏడాది అక్టోబర్ 25న దరఖాస్తు (Covishield application for regular market approval) చేసుకుంది.

Also read: India Covid Cases: ఢిల్లీ, ముంబైలలో విజృంభిస్తోన్న కరోనా.. పలు రాష్ట్రాల్లోని కోవిడ్ తాజా కేసుల వివరాలు

Also read: PM Modi Meet With CMs: సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం- కొవిడ్ పరిస్థితులపై చర్చ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News