కరోనా కాటుకు మహిళ మృతి.. భారత్‌లో మృత్యు ఘంటికలు

భారత్‌లో లాక్ డౌన్ కొనసాగుతున్నా కరోనా వైరస్ మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా 40ఏళ్ల మహిళ కోవిడ్ కాటుకు బలైంది.

Last Updated : Mar 29, 2020, 02:33 PM IST
కరోనా కాటుకు మహిళ మృతి.. భారత్‌లో మృత్యు ఘంటికలు

ముంబై: భారత్‌లో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రను కోవిడ్19 వైరస్ అతలాకుతలం చేస్తోంది. మహారాష్ట్రలో తాజాగా ఓ మహిళ కోవిడ్19 బారిన పడి చనిపోయింది. 40ఏళ్ల మహిళ ఆదివారం ముంబైలో చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తాజా మరణంతో మహారాష్ట్రలో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 7కు చేరుకుంది. కరోనా కాటుకు యువరాణి మృతి

కేవలం మహారాష్ట్రలోనే 170 వరకు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలవరపెడుతోంది. ఓవరాల్‌గా దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 26కు చేరుకున్నట్లు సమాచారం. అందులో ఓ మైగ్రేటెడ్ పేషెంట్ ఉన్నాడని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా, భారత్‌లో కోవిడ్ పాజిటీవ్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. అందులో 86 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని తమ ప్రకటనలో వెల్లడించింది. బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

కాగా, కరోనా మహమ్మారిని జయించేందుకు భారత్‌లో 21 రోజులపాటు విధించిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే గతంలో బయట తిరిగిన వ్యక్తులకు పాజిటీవ్‌గా తేలుతోంది. వీటి నేపథ్యంలోనే సామాజిక దూరం పాటించాలని, అనవసరంగా బయట తిరగవద్దని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసుశాఖ అధికారులు ప్రజలను కోరుతున్నారు. గత రెండు రోజుల్లోనే భారత్‌లో 15 మరణాలు సంభవించడం కలవరపెడుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్

 హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

 

Trending News