Coronavirus Effect: యునైటెడ్ క్వీన్ ను వణికిస్తోన్న కరోనా...

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భయంకరమైన సంకేతాలనిస్తుంది. కాగా కరోనా భయంతో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 రాజభవనం ‘బకింగ్ హాం ప్యాలస్’ ను వీడబోతోన్నట్టు ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో క్వీన్‌ఎలిజబెత్‌ -2ను లండన్‌లోని

Last Updated : Mar 16, 2020, 09:17 AM IST
Coronavirus Effect: యునైటెడ్ క్వీన్ ను వణికిస్తోన్న కరోనా...

లండన్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భయంకరమైన సంకేతాలనిస్తుంది. కాగా(Coronavirus Effect)కరోనా భయంతో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 రాజభవనం ‘బకింగ్ హాం ప్యాలస్’ ను వీడబోతోన్నట్టు ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో క్వీన్‌ఎలిజబెత్‌ -2ను లండన్‌లోని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ నుంచి వింద్‌సార్‌ కాస్టిల్‌కు తరలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

Read Also: శరీరంపై ఏయే రోజుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

బ్రిటన్‌లో కోవిడ్‌-19 ధాటికి మృతుల సంఖ్య 21కి చేరుకుందని, రాబోవు మరికొన్ని రోజుల్లో కరోనా వ్యాప్తి భయంకరంగా వ్యాపించే అవకాశాలున్న నేపథ్యంలో అప్రమత్తమైన బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ అధికార యంత్రాంగం క్వీన్‌ ఎలిజబెత్‌-2తోపాటు ఆమె భర్త ప్రిన్ష్‌ పిలిప్‌ వింద్‌సార్‌ కాస్టిల్‌కు తీసుకెళ్లినట్టు ఓ లేఖలో పేర్కొన్నారు. నొర్‌ఫోక్‌లోని రాయల్‌ సాండ్రింఠఘామ్‌ ఎస్టేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు ప్రాథమిక సమాచారం తెలియజేశారు. 

Also Read: మైనర్‌పై పలుమార్లు అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక

యునైటెడ్ కింగ్ డామ్ లో ఇప్పటివరకు వెయ్యి మందికిపై కరోనా అనుమానిత లక్షణాలున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని, కాగా ఎలిజిబెత్ రాణి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్యాలస్ ఖాళీ చేస్తున్నారని రాజభవన్ వర్గాలు పేర్కొన్నాయి.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News