Cooking Oil Prices: దేశంలో వంట నూనెల ధరలు మళ్లీ తగ్గే ఛాన్స్... రేపే కేంద్రం కీలక సమావేశం...

Cooking Oil Prices: దేశంలో వంట నూనెల ధరల తగ్గింపు దిశగా కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు వంట నూనెల తయారీ కంపెనీలతో రేపు సమావేశం నిర్వహించనుంది. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 3, 2022, 01:50 PM IST
  • తగ్గనున్న వంట నూనెల ధరలు
  • రేపు వంట నూనెల కంపెనీలతో సమావేశం కానున్న కేంద్రం
  • ధరల తగ్గింపుపై చర్చించనున్న కేంద్రం
 Cooking Oil Prices: దేశంలో వంట నూనెల ధరలు మళ్లీ తగ్గే ఛాన్స్... రేపే కేంద్రం కీలక సమావేశం...

Cooking Oil Prices: దేశంలో ధరల పెంపు సామాన్య, మధ్య తరగతి జీవులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై మోయలేని భారం పడుతోంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గడిచిన రెండేళ్లలో సన్‌ఫ్లవర్, సోయాబీన్, మస్టర్డ్ వంటి వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. రెండేళ్ల క్రితం రూ.80గా ఉన్న ధర ఇప్పుడు రూ.200 దాటింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలు దిగొచ్చాయి. దీంతో దేశంలోనూ వంట నూనెల ధరల తగ్గింపు దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది.

దేశీ వంట నూనెల తయారీ సంస్థలు, మార్కెటింగ్ కంపెనీలతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ గురువారం (ఆగస్టు 4) సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ధరల తగ్గింపుపై ఆయా కంపెనీలకు కేంద్రం విజ్ఞప్తి చేయనుంది. ఇదివరకు కూడా ఇలాగే ఆయిల్ కంపెనీలతో రెండుసార్లు సమావేశం నిర్వహించి ధరలు తగ్గించుకోవాల్సిందిగా కేంద్రం కోరింది. దాంతో పలు ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించాయి. 

కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ డేటా ప్రకారం దేశీ మార్కెట్‌లో ఈ ఏడాది జూన్ 1 నుంచి మస్టర్డ్, సోయా, సన్‌ఫ్లవర్, పామాయిల్ ధరలు లీటరకు 5-12 శాతం మేర తగ్గాయి. గత నెలలో అంతర్జాతీయ మార్కెట్‌లో వివిధ రకాల వంట నూనెల ధరలపై టన్నుకు 300 డాలర్ల నుంచి 450 డాలర్ల వరకు ధర తగ్గింది. అయితే రిటైల్ మార్కెట్‌లో ఈ ధరలు వర్తించేందుకు కొంత సమయం పట్టింది. 

ఇక ఈ ఏడాది జూలై 29న అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధరపై టన్నుకు 14 శాతం మేర 1170 డాలర్ల వరకు ధర దిగొచ్చింది. ప్రస్తుతం భారత్‌లో పామాయిల్ వినియోగం 56 శాతంగా ఉంది. పామాయిల్‌తో పాటు సోయాబీన్ 4 శాతం మేర సన్‌ఫ్లవర్ 14 శాతం మేర ధరలు తగ్గాయి. అంటే సోయాబీన్ కుకింగ్ ఆయిల్ టన్నుకు 1460 డాలర్ల మేర, సన్‌ఫ్లవర్ కుకింగ్ ఆయిల్ టన్నుకు 1550 డాలర్ల మేర ధర తగ్గింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ కుకింగ్ ఆయిల్ సంస్థలు ధరలు తగ్గించుకోవాల్సిందిగా కేంద్రం ఆయా కంపెనీలను కోరనుంది. 

Also Read: MUNUGODE BYELECTION LIVE UPDATES: చిల్లర దొంగ.. బ్లాక్ మెయిలర్! రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్

Also Read: కలలో కూడా ఊహించనంత డబ్బు.. కూలీ ఖాతాలో రూ.2700 కోట్లు.. కానీ చివరకు బిగ్ ట్విస్ట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News