మేఘాలయ సీఎంగా కాన్‌రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం

మంగళవారం 12వ మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాన్‌రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు.

Last Updated : Mar 6, 2018, 03:49 PM IST
మేఘాలయ సీఎంగా కాన్‌రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం

మంగళవారం 12వ మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాన్‌రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ లో ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) చీఫ్ అయిన కాన్‌రాడ్ సంగ్మా చేత మేఘాలయ గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణస్వీకారం చేయించారు.  

ఇటీవల వెలువడిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 21 సీట్లను, ఎన్‌పీపీ 19 అసెంబ్లీ సీట్లను దక్కించుకొంది. కాంగ్రెస్ కంటే ముందే చకచకా పావులు కదిపిన బీజేపీ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ 19సీట్లు)కి ఇతర పార్టీల మద్దతు కూడగట్టింది. సింగిల్ డిజిట్ స్థానాలను దక్కించుకున్న యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ), హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(హెచ్ఎస్ పీడీపీ), పీడీఎఫ్‌లను ఏకంచేసి ఎన్‌పీపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పించింది. దీంతో బీజేపీ బలం 39కి చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాగా,  మేఘాలయలో బీజేపీ మోసంతో అధికారం చేపట్టిందన్న ఏఐసీసీ చీఫ్ రాహుల్.. ఈశాన్యాన్ని తిరిగి పొందుతామని  ధీమా వ్యక్తం చేశారు.

 

Trending News