బీజేపీ నేతలకు ఫేస్ బుక్ ( Facebook ) వత్తాసు పలుకుతుందనే వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగింది. ఈ ఆరోపణలపై ఫేస్ బుక్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ కు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా లేఖ రాసింది.
అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ( Wall street journal ) కధనం కలకలం రేపుతోంది. ఎన్నికల సమయంలో విద్వేషపూరిత కధనాలు రాసిన బీజేపీ నేతల పోస్టింగులకు ఫేస్ బుక్ ( Facebook ) సహాకారం అందించినట్టుగా కధనముంది. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ స్థాయి విచారణ ( parliamentary enquiry ) కోసం కాంగ్రెస్ పార్టీ ( Congress party ) డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా సంస్థాగత విచారణ చేపట్టాలంటూ ఫేస్ బుక్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ ( Facebook chief mark zuckerberg ) కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ఈ లేఖను రాహుల్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు. అత్యంత కష్టపడి సాధించిన ప్రజాస్వామ్యనేలలో పక్షపాత, నకిలీ, విద్వేషపూరిత వార్తల్ని అనుమతించమని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. భారతీయులంతా ఫేస్ బుక్ నిజాయితీని ప్రశ్నిస్తున్నారని రాహుల్ తెలిపారు.
We cannot allow any manipulation of our hard-earned democracy through bias, fake news & hate speech.
As exposed by @WSJ, Facebook’s involvement in peddling fake and hate news needs to be questioned by all Indians. pic.twitter.com/AvBR6P0wAK
— Rahul Gandhi (@RahulGandhi) August 18, 2020
ఫేస్ బుక్ ఇండియా అదికారి వైఖరి పట్ల చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత్ లో 40 కోట్లమంది ఫేస్ బుక్ , వాట్సప్ యూజర్లున్నారని..వీరి నమ్మకాల్ని తిరిగి గెల్చుకోవాలంటే దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ పార్టీ ఫేస్ బుక్ కు రాసిన లేఖలో పేర్కొంది.