న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరోసారి విజయదుంధుబి మోగించింది. మొత్తం 70 స్థానాలకుగానూ 62 స్థానాల్లో ఆప్ విజయం సాధించగా, బీజేపీ 8 సీట్లతో పరిపెట్టుకుంది. అయితే వరుసగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో పర్యాయం కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ విషయం వెల్లడైనప్పటికీ కాంగ్రెస్ నేతలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను స్వీకరించలేదు. తమకు కొన్ని స్థానాల్లో పట్టుందని, అక్కడ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత కొంతసేపు రెండు మూడు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగింది. ఇక ఆ తర్వాత ‘సున్నా’కే ఆ పార్టీ పరిమితమైంది.
ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి
2013 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 24శాతం ఓటు బ్యాంకు సాధించిన కాంగ్రెస్ పార్టీ, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 10శాతం ఓట్లను సాధించింది. కానీ ఆప్ ప్రభంజనంలో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. తాజా ఫలితాలలో కూడా ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించక పోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఓట్లశాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. తమకు ఫలితాలు ముందే తెలుసునని చెబుతూనే మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
Also Read: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్
పార్టీ ఓటమిపై ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చోప్రా స్పందించారు. కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆప్, బీజేపీలు మత ప్రాతిపదికన ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లిందని ఏఎన్ఐతో మాట్లాడుతూ చెప్పారు. షీలా దీక్షిత్ 1998 నుంచి 2013వరకు వరుసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారు. అయితే ఆప్ ప్రభావంతో బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీకే అధికంగా నష్టం వాటిల్లింది. గత ఎన్నికల్లో 3సీట్లకు పరిమితమైన బీజేపీ తాజా ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించేలా కనిపించినా చివరికి 8 సీట్లకు పరిమితమైంది.
Also Read: ఢిల్లీ ప్రజలు AAPకే పట్టం కడతారు: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా