CISF Recruitment 2021: మాజీ ఆర్మీ సిబ్బంది కోసం పెద్దఎత్తున ఉద్యోగాలు, అర్హత, జీతం, ఎంపిక విధానం ఇలా

CISF Recruitment 2021: నిరుద్యోగులైన మాజీ ఆర్మీ సిబ్బందికి గుడ్‌న్యూస్. సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఏకంగా 2 వేల పోస్టుల భర్తీకు నోటఫికేషన్ జారీ అయింది. వివరాలిలా ఉన్నాయి

Last Updated : Feb 22, 2021, 10:37 AM IST
CISF Recruitment 2021: మాజీ ఆర్మీ సిబ్బంది కోసం పెద్దఎత్తున ఉద్యోగాలు, అర్హత, జీతం, ఎంపిక విధానం ఇలా

CISF Recruitment 2021: నిరుద్యోగులైన మాజీ ఆర్మీ సిబ్బందికి గుడ్‌న్యూస్. సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఏకంగా 2 వేల పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ జారీ అయింది. వివరాలిలా ఉన్నాయి..

కేంద్ర పారిశ్రామిక రక్షణ బలగాలు స్థూలంగా చెప్పాలంటే సీఐఎస్ఎఫ్( CISF )‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. సీఐఎస్ఎఫ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌( CISF Jobs Notification)ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిస్‌లో దాదాపు 2 వేల ఉద్యోగాల్ని భర్తీ చేస్తోంది. ఇందులో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాలున్నాయి. మాజీ ఆర్మీ సిబ్బంది మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్ధులు  మార్చ్ 15, 2021 లోగా దరఖాస్తుల్ని సీఐఎస్ఎఫ్ యూనిట్‌కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా వివిధ సీఐఎస్ఎఫ్ యూనిట్లలో ఖాళీగా ఉన్న 2 వేల పోస్టుల( 2 thousand posts recruitment ) భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 1326 కానిస్టేబుల్ పోస్టులు, 424 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, 187 ఏఎస్ఐ పోస్టులు, 63 ఎస్ఐ పోస్టులున్నాయి. అభ్యర్దులకు కావల్సిన అర్హత, జీతభత్యాలు , ఎంపిక విధానం ఇలా ఉంది.

ఎస్ఐ ( SI Jobs )పోస్టుకు నెలకు 40 వేల రూపాయలు జీతం కాగా, ఏఎస్ఐ ( ASI jobs )పోస్టుకు 35 వేల రూపాయలు చెల్లిస్తారు. ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు 30 వేలు, కానిస్టేబుల్ పోస్టుకు 25 వేల రూపాయలు వేతనం ఉంటుంది. ప్రభుత్వ వైద్యుడితో మెడికల్ ఫిట్నెస్ సర్ఠిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాలకు 170 సెంటీమీటర్లు ఎత్తు, ఛాతీ 80 సెంటీమీటర్ల వెడల్పు ఉండాలి. ఎస్టీ కేటగరీకు చెందినవారికి ఎత్తు 162.5 సెంటీమీటర్లు కాగా..గర్హ్‌వాల్, కుమాన్, హిమాచల్ ప్రదేశ్, గోర్ఖాస్, దోగ్రాస్, మరాఠాస్, కాశ్మీర్ వ్యాలీ, లేహ్ మరియు లడాఖ్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిమ్ ప్రాంతాలకు చెందిన వారికి 165 సెంటీమీటర్ల ఎత్తు ఉంటే చాలు. ఇక ఛాతీ విషయంలో ఎస్టీ కేటగరీ వారికి 3 సెంటీమీటర్లు మినహాయింపు ఉంటుంది.  వయస్సు 50 సంవత్సరాల వరకూ ఉండవచ్చు.

Also read: Farmers protest: రైతు ఆందోళన ఇక మరింత ఉధృతం, సుదీర్ఘ పోరు కోసం కార్యాచరణ ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News