రాజధాని, శతాబ్ది రైళ్ళల్లో సినిమాలు ఫ్రీగా చూపిస్తారట..!

భారతీయ రైల్వే తాజాగా తీసుకొస్తున్న ఓ పథకంలో భాగంగా రాజధాని, శతాబ్ది రైళ్ళల్లో ఏసీ కంపార్ట్‌మెంట్స్‌లో ట్రావెల్ చేసే ప్రయాణికులు ఫ్రీగా సినిమాలు చూడవచ్చట.

Last Updated : Feb 10, 2018, 09:38 PM IST
రాజధాని, శతాబ్ది రైళ్ళల్లో సినిమాలు ఫ్రీగా చూపిస్తారట..!

భారతీయ రైల్వే తాజాగా తీసుకొస్తున్న ఓ పథకంలో భాగంగా రాజధాని, శతాబ్ది రైళ్ళల్లో ఏసీ కంపార్ట్‌మెంట్స్‌లో ట్రావెల్ చేసే ప్రయాణికులు ఫ్రీగా సినిమాలు చూడవచ్చట. మీ వద్ద ల్యాప్ టాప్ ఉంటే చాలు. వాటిని మీ సీట్ ముందు కనెక్ట్ చేసిన మినీ టేబుల్ పై పెట్టుకొని.. రైల్వేవారు అందించే ఉచిత వైఫై సదుపాయంతో ఉచితంగా సినిమాలు చూడవచ్చు. 

చెన్నై నుండి బెంగుళూరు, మైసూర్ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కోసం తొలిసారిగా ప్రయోగాత్మకంగా "స్వర్ణ ఏసీ ఛైర్ కార్" అనే ప్రాజెక్టు టేకప్ చేసింది ఇండియన్ రైల్వే. ఈ  ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికులకు ఇన్ బిల్ట్ ఎంటర్‌టైన్ సిస్టమ్‌తో పాటు వైఫై సదుపాయం కల్పించి వినోదాన్ని అందించే ప్రయత్నాలు చేస్తున్నారు.

మ్యాజిక్ బాక్స్ అనే ప్రైవేటు కంపెనీ సహకారంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సహాయాన్ని ఇండియన్ రైల్వే పొందుతోంది. వైఫై కనెక్ట్ అయ్యాక, ఈ కంపెనీ వెబ్ సైట్ ఓపెన్ చేసి మీ ల్యాప్‌టాప్‌లోనే సినిమాలు చూడవచ్చు. అయితే కేవలం వైఫై సదుపాయం ఆ వెబ్ సైట్లో సినిమాలు చూడడానికి మాత్రమే పనికొస్తుంది తప్పితే.. బ్రౌజింగ్‌కు యాక్సెస్ ఇవ్వడం కుదరదని రైల్వేశాఖ తెలిపింది.

Trending News