CTET Result 2024 Declared : సిబిఎస్ఈ సీటెట్ 2024 రిజల్ట్స్ ఔట్..డైరెక్ట్ లింక్ ఇదే..చెక్ చేసుకోండి..!

CTET 2024 Result : సీటెట్ ఫలితాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసింది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. 

Written by - Bhoomi | Last Updated : Jul 31, 2024, 06:20 PM IST
CTET Result 2024 Declared : సిబిఎస్ఈ సీటెట్ 2024 రిజల్ట్స్ ఔట్..డైరెక్ట్ లింక్ ఇదే..చెక్ చేసుకోండి..!

CBSE CTET Result 2024: సెంట్రల్ టీచర్స్ ఎలిలిజిబిలిటీ టెస్టు జులై 2024 రిజల్ట్స్ ను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో ఫలితాను చెక్ చేసుకోవచ్చు. కాగా దేశవ్యాప్తంగా సీటెట్ జులై 27న నిర్వహించిన సంగతి తెలిసిందే. సీటెట్ ఫలితాలను www.ctet.nic.in లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సీటెట్ పరీక్ష ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 2, పేపర్ 1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించారు.జనవరి సెషన్ CTET పరీక్షకు మొత్తం 7,95,231 మంది అభ్యర్థులు పేపర్ వన్‌కు హాజరవ్వగా..అందులో  1,26,845 మంది పరీక్షకు అర్హత సాధించారు. 14,81,242 మంది పేపర్ II పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,12,033 మంది ఉత్తీర్ణులయ్యారు. జనవరి ఫలితాలు కూడా డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచారు. 

Also  Read: Rule Change From 1st August: ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నియమాలు..!

CBSE ప్రకారం, NCTE నోటిఫికేషన్ తర్వాత, CTET సర్టిఫికేట్ పొందడానికి, అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అయితే, పాఠశాల నిర్వహణలు  SC, ST, OBC వికలాంగుల వర్గాలకు చెందిన అభ్యర్థులకు రాయితీ ఇచ్చే ఛాన్స్ ఉంది. 

Also  Read: Gold Rate Today:శ్రావణ మాసంలో బంగారం కొంటున్నారా? తరుగు,మజూరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News