Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ వాయిదా పడనుందా, ఇస్రో ప్లాన్ బి ఏంటి

Chandrayaan 3: యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న చంద్రయాన్ 3 రేపే సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండే రేపు సాయంత్రం అనుకున్న సమయాన్నిచంద్రయాన్ 3 ల్యాండింగ్ పూర్తయి..ఇస్రో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 22, 2023, 06:07 AM IST
Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ వాయిదా పడనుందా, ఇస్రో ప్లాన్ బి ఏంటి

Chandrayaan 3: ఇస్రో కొత్త చరిత్ర లిఖించేందుకు సమయం ఆసన్నమైంది. మరి కొద్దిగంటల్లో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రాజెక్టు జైత్రయాత్ర పూర్తి కానుంది. చంద్రుని దక్షిణ ధృవంపై ఆడుగుపెట్టే తొలిదేశంగా ఇండియా ఖ్యాతినార్జించనుంది. ప్రపంచమంతా చంద్రయాన్ 3 జైత్రయాత్రను ప్రత్యక్షంగా వీక్షించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చంద్రయాన్ 3 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు అంటే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ కానుంది. వాస్తవానికి 17 నిమిషాలు ముందుగా అంటే 5.47 నిమిషాలకు ల్యాండ్ కావల్సిన చంద్రయాన్ 3 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది ఇస్రో. అన్నీ అనుకున్నట్టు సక్రమంగా జరిగితే రేపు సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా అడుగుపెట్టనుంది.  మొత్తం ప్రపంచం ఈ అరుదైన ఘట్టాన్ని తిలకించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 

ఇది కాస్తా పూర్తయితే చంద్రునిపై విజయవంతంగా దిగిన నాలుగవ దేశంగా ఇండియా నిలబడుతుంది. ఇప్పటి వరకూ యూఎస్, రష్యా, చైనాలు ఈ ఘనత సాధించాయి. అయితే చంద్రుని దక్షణ ధృవాన్ని టార్గెట్ చేసింది మాత్రం తొలిసారిగా ఇండియానే. అంటే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పూర్తయితే దక్షిణ ధృవంపై దిగిన తొలిదేశం అవుతుంది. గతంలో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయిన చంద్రయాన్ 2 ఆర్బిటార్ మాత్రం ఇంకా పనిచేస్తోంది. ఇప్పుడీ ఆర్బిటార్..విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేట్ అయినట్టు ఇస్రో తెలిపింది. వెల్‌కం బడ్డీ అంటూ చంద్రయాన్ 2 ఆర్బిటార్,..ల్యాండర్ మాడ్యూల్ కు స్వాగతం పలికింది.

రేపు కాకుంటే ఆగస్టు 27న ల్యాండింగ్

చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ల్యాండ్ అయ్యే సమయానికి అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో అనేది పూర్తిగా అంచనా వేస్తున్నారు. అందుకే ప్లాన్ బి సిద్ధం చేసుకున్నారు. ల్యాండింగ్ సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ లో ఉన్న పరికరాలతో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితిని అంచనా వేయనున్నారు. పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేకపోయినా ల్యాండింగ్ ప్రక్రియ వాయిదా పడనుంది. అంటే రేపు సాయంత్రం మిస్ అయితే..తిరిగి ఆగస్టు 27వ తేదీకి వాయిదా పడుతుంది. 

ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ హజార్ట్ డిటెక్షన్ అండ్ ఎవాయిడెన్స్ కెమేరా తీసిన చంద్రుని దక్షిణ ధృవం ఫోటోల్ని ఇస్రో విడుదల చేసింది. రాళ్లు, గుంతలు లేకుండా ఉన్న ప్రాంతాన్ని ఈ ఫోటోలతో గుర్తించి ఆ ప్రదేశంలో ల్యాండ్ చేయనున్నారు. మరోవైపు చంద్రయాన్ 2 ఆర్బిటార్‌తో అనుసందానం అవడం వల్ల ల్యాండర్ మాడ్యూల్ గురించి ఎక్కువగా తెలుసుకునేందుకు వీలవుతోంది. ఇప్పటివరకూ ల్యాండర్ మాడ్యూల్ అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. 

Also read: Chandrayaan 3 Live Streaming: చంద్రయాన్ 3 ల్యాండింగ్ సమయం ప్రకటన, ప్రత్యక్ష ప్రసారం ఎన్ని గంటలకు ఎందులో చూడవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News