Chandrayaan 3: చంద్రయాన్ 3 యాత్ర ఎప్పుడో నిర్ధారించిన ఇస్రో, జూలైలోనే ప్రయోగం

Chandrayaan 3: చంద్రయాన్ 3కు అంతా సిద్ధమైంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్ 3 యాత్ర ఎప్పుడనేది ప్రకటించారు. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2023, 05:51 PM IST
Chandrayaan 3: చంద్రయాన్ 3 యాత్ర ఎప్పుడో నిర్ధారించిన ఇస్రో, జూలైలోనే ప్రయోగం

Chandrayaan 3: ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ఇస్రో జీఎస్ఎల్‌వి ఎఫ్ 12 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా ఎన్ఎస్‌వి-01 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా పూర్తి స్థాయి స్వదేశీ నావిగేషన్‌కు శ్రీకారం చుట్టింది ఇస్రో. ఈ సందర్భంగా మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ చంద్రయాన్ 3 గురించి కీలకమైన అప్డేట్ ఇచ్చారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చంద్రయాన్ 3 ప్రయోగం వివరాలు అందించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 గురించి కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. ఇవాళ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్‌వి ఎఫ్ 12 రాకెట్ ద్వారా ఎన్‌ఎస్ వి-01 ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైన తరువాత ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రయాన్ 3 గురించి సమాచారమిచ్చారు. చంద్రయాన్ 3 యాత్ర ఎప్పుడుంటుందో చెప్పారు. 

చంద్రయాన్ 3 యాత్ర ఈ ఏడాది జూలైలో ఉంటుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చంద్రయాన్ 3 యాత్ర విజయవంతం కానుందని పూర్తి నమ్మకముందన్నారు. చంద్రయాన్ 3 అనేది చంద్రయాన్ 2కు కొనసాగింపు. చంద్రునిపై సురక్షితమైన ల్యాండింగ్, సంచరించడంలో పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని ప్రదర్శించే వీలుంది. చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ కలిపి ఉంటుంది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం 3 ద్వారా చంద్రయాన్ 3 ప్రయోదం జరగనుంది. చంద్రయాన్ 3 లో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, రోవర్ ఉంటాయి. చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేసేందుకు ల్యాండర్, రోవర్‌లు శాస్త్రీయమైన పేలోడ్స్ కలిగి ఉంటాయి. 

2019లో జరిగిన చంద్రయాన్ 2 యాత్ర చివరి దశలో విఫలమైంది. విజయవంతంగా చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టినా..సాఫ్ట్‌వేర్ లోపం తలెత్తడంతో 2019 సెప్టెంబర్ 6వ తేదీన చంద్రునిపై ల్యాండ్ అయ్యే క్రమంలో కక్ష్య నుంచి వైదొలగి ల్యాండర్ కాస్తా ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయింది. అయితే ఆర్బిటార్ మాత్రం ఇంకా పనిచేస్తుండటం విశేషం. 

చంద్రయాన్ 3ను చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ చేసేందుకు సర్వం సిద్ధమౌతోంది. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా,పర్యావరణం, ధర్మో ఫిజికల్ లక్షణాలు, భూకంప అవకాశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన సైంటిఫిక్ పరికరాల్ని పంపనున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం పూర్తిగా విజయవంతమయ్యేందుకు ఇస్రో అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 

Also read: GSLV F12 Success: జీఎస్ఎల్‌వి ఎఫ్ 12 విజయవంతం, ఇకపై స్వదేశీ నావిగేషన్, ప్రత్యేకతలివీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News