Chandrayaan 3 Countdown: రేపే చంద్రయాన్ 3 ప్రయోగం, ప్రారంభమైన కౌంట్‌డౌన్, ప్రయోగం ఎలా జరుగుతుందంటే

Chandrayaan 3 Countdown: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. భారత అంతరిక్ష పరిశోథనా సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్ 3 గురించి పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2023, 04:53 PM IST
Chandrayaan 3 Countdown: రేపే చంద్రయాన్ 3 ప్రయోగం, ప్రారంభమైన కౌంట్‌డౌన్, ప్రయోగం ఎలా జరుగుతుందంటే

Chandrayaan 3 Countdown: దేశ ప్రజలే కాదు..ప్రపంచం మొత్తం ఇప్పుడు రేపు జరగనున్న చంద్రయాన్ 3 ప్రయోగంవైపు చూస్తోంది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానున్న చంద్రయాన్ 3 ప్రయోగం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యంత కీలకమైన, ఉత్కంఠ భరితమైన కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు మద్యాహ్నం 2.35 గంటలకు చంద్రమండలంలోకి రాకెట్ దూసుకెళ్లనుంది.

ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగం రేపు అంటే జూలై 14వ తేదీ మద్యాహ్నం 2.35 గంటలకు జరగనుంది. బాహుబలి రాకెట్‌గా పేర్కొనే LVM-3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కావచ్చని ఇస్రో అంచనా. ఇంతకుముందు
2019 జూలైలో ప్రయోగించిన చంద్రయాన్ 2 చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో విఫలమైంది.ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఇస్రో శాస్ట్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రయోగాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. రేపు మధ్యాహ్నం జరగాల్సిన చంద్రయాన్ 3 ప్రయోగం కోసం ఇవాళ మద్యాహ్నం 1.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రయాన్ 3ను ప్రయోగించే ఎల్‌విఎం 3 రాకెట్‌పైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇస్రో అభివృద్ధి చేసిన ఈ రాకెట్ అత్యంత శక్తివంతమైంది. భారీ పరిమాణంలోని పేలోడ్‌ను సులభంగా మోసుకెళ్లగలదు. దశలవారీగా ఇంధనాన్ని మండించడం ద్వారా రాకెట్ ను నింగిలోకి పంపిస్తారు. ఘన, ద్రవ ఇంధన ఇంజన్లు, స్టాప్ ఆన్ బూస్టర్లు నిర్దేశిత సమయాల్లో పనిచేస్తాయి. ఈ రాకెట్ బరువు 640 టన్నులు ఉంటుంది. 4 వేల కిలోల పేలోడ్ జయో సింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి మోసుకెళ్తుంది. 

చంద్రయాన్ -3 అనేది భారత చంద్రయాన కార్యక్రమంలో మూడవది. చంద్రయాన్-2 లో  ఉన్నట్టే ఇందులో కూడా ఒక రోవర్, ఒక ల్యాండర్‌ను పంపిస్తారు. కానీ ఇందులో ఆర్బిటర్ ఉండదు. దీని ప్రొపెల్ర్ మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్లర్ మాడ్యూల్ చంద్రుని చుట్టూ 100 కిలోమీటర్ల కక్ష్య వరకూ ల్యాండర్, రోవర్‌ను తీసుకెళ్లగలదు. చంద్రయాన్ 3 ప్రాజెక్టు కోసం ఇస్రో 615 కోట్లు ఖర్చుపెడుతోంది. ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ  25 గంటల 30 నిమిషాలు కొనసాగుతుంది.

Also read: Delhi Floods Updates: యమునా నది మహోగ్రరూపం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటిని ముంచెత్తిన వరదలు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News