OTT Ban: అశ్లీల కంటెంట్‌ ప్రియులకు కేంద్రం భారీ షాక్‌.. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రద్దు

OTT Platforms Ban:ఓటీటీ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. హెచ్చరికలు జారీ చేస్తున్నా పట్టించుకోకపోవడంతో వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అశ్లీల, హింస కంటెంట్‌ అందిస్తుండడంతో కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను రద్దు చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 14, 2024, 04:28 PM IST
OTT Ban: అశ్లీల కంటెంట్‌ ప్రియులకు కేంద్రం భారీ షాక్‌.. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రద్దు

OTT Platforms Blocked: సెన్సార్‌ లేదని ఇష్టమొచ్చినట్టు రీతిన అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఓటీటీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పలుమార్లు హెచ్చరికలు చేసినా పద్దతి మార్చుకోకపోవడంతో ఆ సంస్థలను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతోపాటు వెబ్‌సైట్‌లు, కొన్ని యాప్‌లు, సామాజిక మాధ్యమాల ఖాతాలను రద్దు చేసింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను రద్దు చేసింది. ఇక 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, 57 సోషల్‌ మీడియా ఖాతాలను తొలగిస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read: Gangsters Marriage: అంగరంగ వైభవంగా గ్యాంగ్‌స్టర్ల పెళ్లి.. ఖైదీలు, గూండాలు, రౌడీలే అతిథులు

 

దేశీయంగా ఉన్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అసభ్యకర కంటెంట్‌ ప్రసారం చేస్తున్నాయని ఇటీవల కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. వాటిపై చర్యలు ఉంటాయని హెచ్చరించిన రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 19 వెబ్‌సైట్‌లతోపాటు ఫేసుబుక్‌లో 12, ఇన్‌స్టాగ్రామ్‌లో 17, ఎక్స్‌లో 16, యూట్యూబ్‌లో 12 ఖాతాలను రద్దు చేసింది. అశ్లీల ప్రసారాలు చేస్తున్నారని గుర్తించి హెచ్చరికలు జారీ చేసినా వారిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో వాటిని రద్దు చేసింది. అయితే ఓటీటీ సంస్థలకు సంబంధించి వ్యూస్‌ బాగున్నాయి. ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు 32 లక్షల వ్యూస్‌ ఉండగా.. కోటికి పైగా డౌన్‌లోడ్స్‌ ఉన్నాయని ప్రకటనలో కేంద్రం వివరించింది.

Also Read: Pink Tax: పురుషుల కంటే మహిళలకే అధిక ధరలు.. అసలు 'పింక్‌ ట్యాక్స్‌' అంటే ఏమిటో తెలుసా?

 

రద్దు చేసిన ఓటీటీలు ఇవే
డ్రీమ్స్‌ ఫిలిమ్స్‌, వూవీ, యెస్మా, అన్‌కట్‌ అడ్డా, త్రి ఫ్లిక్స్‌, ఎక్స్‌ ప్రైమ్‌, నియోన్‌ ఎక్స్‌ వీఐపీ, బెషరమ్స్‌, హంటర్స్‌, రబ్బిట్‌, ఎక్స్‌ట్రామూడ్‌, న్యూఫ్లిక్స్‌, మూడక్స్‌, మోజ్‌ఫ్లిక్స్‌, హట్‌ షాట్స్‌ వీఐపీ, ఫగీ, చికోఫ్లిక్స్‌, ప్రైమ్‌ ప్లే

ప్రస్తుతం వెండితెర కన్నా 'ఇంటితెర' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఇంటితెరగా పేర్కొంటున్నారు. థియేటర్‌లకు వెళ్లకుండా కుటుంబసమేతంగా వీలు చిక్కినప్పుడు ఇష్టమైన కంటెంట్‌ చూసేందుకు దోహదం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ ఓటీటీలకు బాగా అలవాటుపడ్డారు. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు తమ కంటెంట్‌ను యథావిధిగా అశ్లీలంతో కూడినవి అందిస్తుండడంతో వీక్షకులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, మహిళలు చూడలేని విధంగా కంటెంట్‌ ఉంటుండడంతో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News