Jobs: బీటెక్ పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధం

బీటెక్ గ్యాడ్యుయేట్స్ కు శుభవార్త. ఇంజనీరింగ్ పూర్తి చేసినవారికి కేంద్ర ప్రభుత్వ కొలువులు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు ఇవీ..

Last Updated : Jul 24, 2020, 02:06 PM IST
Jobs: బీటెక్ పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధం

బీటెక్ గ్యాడ్యుయేట్స్ కు శుభవార్త. ఇంజనీరింగ్ పూర్తి చేసినవారికి కేంద్ర ప్రభుత్వ కొలువులు ( Government Jobs ) సిద్ధంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉద్యోగాల ( Jobs Notification ) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు ఇవీ..

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ( Cetral Defence Minsitry ) ఆధ్వ ర్యంలో నడిచే ప్రతిష్టాత్మక సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ( BEL )  ఇంజనీర్ల భర్తీకు నోటిఫికేషన్ జారీ అయింది. కంపెనీలోని పలు విభాగాల్లో ప్రాజెక్టు ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టులు దాదాపు 77 ఖాళీలున్నాయి. బెల్ ఇప్పుడు వీటిని భర్తీ చేయనుంది. ఘజియాబాద్ యూనిట్, నేవీ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ తో పాటు పలు ఇతర ప్రాజెక్టుల్లో నియమించనున్నారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

పూర్తి వివరాలు:

మొత్తం ఖాళీలు  77

ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టు …    1

ఈసీఈ …….                         8

కంప్యూటర్ సైన్స్ ….          13

ట్రైనీ ఇంజనీర్                     5

ట్రైనీ ఇంజనీర్ 1                  20

ప్రాజెక్టు ఇంజనీర్  1             30

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 2. ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టుకు మాత్రం చివరి తేదీ ఆగస్టు 17గా ఉంది. ఈ నోటిఫికేషన్ కు చెందిన పూర్తి వివరాల్ని http://bel-india.in లో తెలుసుకోవచ్చు. Also read: CIL Jobs 2020: కోల్ ఇండియా లిమిటెడ్‌లో 2305 జాబ్స్

Trending News