కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి నేపధ్యంలో అమలైన మారటోరియం పొడిగింపు ( Moratorium Extension ) పై స్పష్టత వచ్చేసింది. పొడిగింపు ఇకపై సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు తేల్చి చెప్పాయి.
కరోనా వైరస్ సంక్రమణ, లాక్డౌన్ ( Lockdown ) నేపధ్యంలో ఎక్కడికక్కడ జనజీవనం స్థంబించింది. ఉపాది పోయింది. ఈ నేపధ్యంలో రుణ గ్రహీతలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మారటోరియం విధించింది. అయితే ఈ మారటోరియంను మరోసారి పొడిగించాలనే విషయంపై చర్చ సాగింది. మారటోరియం కాలంలో 2 కోట్ల వరకూ ఉన్న రుణాలపై వడ్డీపై వడ్డీని వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో క్రెడాయ్ వంటి సంఘాల వాదన పరిశీలించాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ( Central Government ) , ఆర్బీఐ ( RBI ) మారటోరియంపై స్పష్టత ఇచ్చాయి. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించాయి.
రుణాలపై విధించిన మారటోరియంను మరోసారి పొడిగించడం సాధ్యం కాదని అఫిడవిట్ లో పేర్కొన్నాయి. ఆరు నెలలకు మించి ఉపశమనం ఇవ్వడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve Bank of India ) తాజా అఫిడవిట్లో స్పష్టం చేసింది. నిర్దిష్ట సెక్టార్ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి కోర్టు వెళ్లకూడదంటూ తాజా అఫిడవిట్లో ఆర్బీఐ, ప్రభుత్వం పేర్కొన్నాయి. మారటోరియం వ్యవధి ఆరునెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరు, ప్రక్రియపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ తెలిపింది. ఈ చర్య రుణ గ్రహీతలపై ఒత్తిడిని పెంచుతుందని కూడా వాదించింది. వడ్డీ మీద మాఫీ చేయడమే కాకుండా, మరే ఇతర ఊరట కల్పించినా దేశ ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
కోవిడ్-19 ( Covid 19 ) కు ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని తెలిపింది. ఈనేపథ్యంలోఈ రంగంలోని కష్టాలను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని తెలిపింది. రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వివరణ ఇచ్చాయి. అయితే ఆరునెలల రుణాల తాత్కాలిక నిషేధ కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపిన నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్బీఐకి, కేంద్రానికి అక్టోబర్ 5న ఒక వారం సమయం ఇచ్చింది. అంటే మారటోరియం పొడిగించకపోయినా...వడ్డీపై వడ్డీ మాత్రం మాఫీ అవుతుందన్నమాట. Also read: FIR on Kangana Ranaut: చిక్కుల్లో కంగనా రనౌత్..కేసు నమోదుకు ఆదేశించిన న్యాయస్థానం