Cbse Results 2023: CBSE 10, 12 ఫలితాలు త్వరలోనే, ఈ లింక్‌తో డైరెక్ట్‌ రిజల్ట్స్‌ పొందొచ్చు!

Cbse Class 10 Results Date 2023: CBSE 10, 12వ తరగతి సంబంధించిన ఫలితాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయని సీనియర్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఫలితాలు ఇదే నెలలో రెండవ వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని అయన పేర్కొన్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 11, 2023, 12:02 PM IST
Cbse Results 2023: CBSE 10, 12 ఫలితాలు త్వరలోనే, ఈ లింక్‌తో డైరెక్ట్‌ రిజల్ట్స్‌ పొందొచ్చు!

Cbse Class 10 Results Date 2023: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలను త్వరలోనే విడుదల చేయనుంది. ఇప్పటికే రిజల్ట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సీనియర్ బోర్డు అధికారి వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ చివరి దశలోకి చేరుకుందన్నారు. అందుకే ఈ ఫలితాలను వచ్చే వారంలోనే వెలుబడతాయని బోర్డు అధికారి తెలిపారు. ఈ ఫలితాలను నేరుగా results.cbse.nic.in, cbse.gov.in వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి. 

ఇప్పటికే CBSE 10, 12వ తరగతి సంబంధించిన ఫలితాల నోటిఫికేషన్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. అయితే దీనిపైన స్పందించిన అధికారు ఫలితాలకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని విద్యా శాఖ విడుదల చేయలేదని తెలిపారు. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న నోటిఫికేష్‌ నకిలీదని అధికారు తేల్చి చెప్పారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఇలాంటి ఫేక్‌ వెబ్‌ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఫలితాలు వచ్చిన వెంటనే results.cbse.nic.in వెబ్‌ పోర్టల్‌లో స్కోర్‌కార్డ్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ కార్డ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి తప్పకుండా ఈ కింది పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. 

Also read: Karnataka Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ వెనుకంజ, జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ సహా అన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం

స్కోర్‌కార్డ్  డౌన్‌లోడ్ చేసుకోవడానికి కావాల్సినవి:
ముందుగా స్కోర్‌కార్డ్  డౌన్‌లోడ్ తెలుసుకోవడానికి అధికారిక పోర్టల్- cbse.nic.in, cbseresults.nic.in, results.nic.inలో విద్యార్థులు లాగ్-ఇన్  అవ్వాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా రోల్ నంబర్‌తో పాటు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు సైట్‌లో ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. వీటిని ఫిల్‌ చేసిన తర్వాత సబ్మిట్‌ చేస్తే మీ స్క్రీన్‌పై  స్కోర్‌కార్డ్ కనిపిస్తుంది. అప్పుడు మీకు  డౌన్‌లోడ్ లభిస్తుంది. దానిని సులభంగా  డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్‌ నొక్కాల్సి ఉంటుంది. 

డిజిలాకర్ ద్వారా కూడా రిజల్ట్స్‌ పొందొచ్చు:
డిజిలాకర్ యాప్‌ ద్వారా ఫలితాలను పొందడానికి ముందుగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం digitallocker.gov.in సందర్శించాల్సి ఉంటుంది. 
ఈ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్న తర్వాత  మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రార్‌ అవ్వాల్సి ఉంటుంది. కావాలనుకుంటే సెక్యూరిటీ పిన్ కూడా పెట్టుకోవచ్చు. 
ఇలా రిజిస్ట్రేషన్‌ జరిగిన తర్వాత నేరుగా మీ మొబైల్‌కే స్కోర్‌కార్డ్ డెలివరీ అవుతుంది. 

Also read: Karnataka Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ వెనుకంజ, జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ సహా అన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News