సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదల, 99 శాతంతో రికార్డు సాధించిన సీబీఎస్ఈ

CBSE 10th Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కీలకమైన పదవ తరగతి ఫలితాల్ని విడుదల చేసింది. అత్యధికంగా 99.04 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దయి..అసెస్‌మెంట్ ద్వారా ఫలితాలు వెల్లడించారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 4, 2021, 10:43 PM IST
సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదల, 99 శాతంతో రికార్డు సాధించిన సీబీఎస్ఈ

CBSE 10th Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కీలకమైన పదవ తరగతి ఫలితాల్ని విడుదల చేసింది. అత్యధికంగా 99.04 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దయి..అసెస్‌మెంట్ ద్వారా ఫలితాలు వెల్లడించారు. 

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) కారణంగా ఈ విద్యా సంవత్సరపు సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. సీబీఎస్ఈ ఆల్టర్నేటివ్ అసెస్‌మెంట్ విధానం ద్వారా ఫలితాలు వెల్లడించింది సీబీఎస్ఈ బోర్డు. బహుశా అందుకే గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 99.04 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 91.46 శాతం మాత్రమే కావడం గమనార్హం. 

ఈ ఏడాది 21.13 లక్షలమంది విద్యార్ధులు పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా..16 వేల 639 మంది విద్యార్ధుల ఫలితాల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక 17 వేల 636 మంది విద్యార్ధులకు కంపార్ట్‌మెంట్ పరీక్షను ఆగస్టు 16-సెప్టెంబర్ 15 మధ్య నిర్వహించే అవకాశాలున్నాయి. సీబీఎస్ఈ పదవ తరగతి (CBSE 10th Results)పరీక్షల్లో త్రివేండ్రం రీజియన్ అత్యధికంగా 99.99 శాతం మార్కులు సాధించగా..బెంగళూరు 99.96 శాతం ఉత్తీర్ణత సాధించింది. 95 శాతం కంటే ఎక్కువ సాధించిన విద్యార్ధులు గత ఏడాది కంటే 16 వేలు పెరిగారు. అటు 90-95 శాతం మధ్య స్కోర్ చేసిన విద్యార్ధుల సంఖ్య కూడా 16 వేల వరకూ పెరిగింది. 

Also read: ప్రజలకు చేరువవుతున్న మేకిన్ ఇన్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కూ యాప్, ఖాతా తెరిచిన జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News