CBSE Board Exams: సీబీఎస్ఈ పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే, పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE Board Exams: సీబీఎస్ఈ పరీక్షల విధానంపై స్పష్టత వచ్చింది. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు..షెడ్యూల్ కూడా ప్రకటించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2021, 07:38 AM IST
  • సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఆఫ్ లైన్ విధానంలోనే
  • సీబీఎస్ఈ పది, పన్నెండు తరగతి పరీక్షలు నవంబర్-డిసెంబర్ నెలల్లో
  • సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షల షెడ్యూల్ అక్టోబర్ 18న విడుదలయ్యే అవకాశం
 CBSE Board Exams: సీబీఎస్ఈ పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే, పరీక్షల షెడ్యూల్ విడుదల

CBSE Board Exams: సీబీఎస్ఈ పరీక్షల విధానంపై స్పష్టత వచ్చింది. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు..షెడ్యూల్ కూడా ప్రకటించింది.

సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల నిర్వహణపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE Board)స్పష్టత ఇచ్చింది. పది, పన్నెండవ తరగతి టర్మ్ 1 పరీక్షల్ని ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు జరుగుతాయని సూచించిన సీబీఎస్ఈ బోర్డు..పరీక్ష షెడ్యూల్‌ను అక్టోబర్ 18న విడుదల చేయనుంది. 

సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు ఆబ్జెక్టివ్ మోడ్‌లో(CBSE Board Exams 2021)ఉండి..ఒక్కొక్క పరీక్ష వ్యవధి 90 నిమిషాలుంటుంది. చలికాలం దృష్టిలో ఉంచుకుని పరీక్షల్ని ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభించనున్నారు. టర్మ్-1, టర్మ్-2 పరీక్షల అనంతరం తుది ఫలితాలు వెలువడనున్నాయి. టర్మ్-2 పరీక్షలు మాత్రం 2022 సంవత్సరం మార్చ్-ఏప్రిల్ నెలల్లో జరగనున్నాయి. టర్మ్ 2 పరీక్షల మాత్రం రాతపూర్వకంగా ఉండనుంది. టర్మ్ 1 పరీక్ష(CBSE Board Term 1 Exams Schedule) అనంతరం సాధించిన మార్కుల వివరాల్ని వెల్లడిస్తారు. టర్మ్ 1 లో మాత్రం ఏ విద్యార్ధికి పాస్ లేదా కంపార్ట్‌మెంట్ అని ప్రకటించరు. రెండు టర్మ్ పరీక్షలు ముగిసిన తరువాతే తుది ఫలితాలుంటాయి. రెండు బోర్డు పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయాన్ని సీబీఎస్ఈ జూలై నెలలో తీసుకుంది. రెండు టర్మ్ పరీక్షల్లో విద్యార్ధి సామర్ద్యం ఆధారంగా తుది స్కోర్ ఉంటుంది. ఈ రెండు టర్మ్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ పరీక్షలు, ఎస్సెస్‌మెంట్స్, ప్రోజెక్టుల్ని ప్రతి విద్యార్ధి పూర్తి చేయవల్సి ఉంటుంది. 

Also read: BOMBAY High Court: బోంబే హైకోర్టులో వరవరరావుకు ఊరట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News