Karnataka MUDA case HC rejects Siddaramaiahs plea: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకంది. ముడా స్కామ్ ఘటన కర్ణాటకలో రాజకీయంగా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని .. మరీ తన భార్యకు భూములు కట్టబెట్టారని ఘటన వెలుగులోకి వచ్చింది.
ముఖ్యంగా.. మైసూర్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో అనేక భూముల్ని.. గతంలో సిద్ధరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని మరీ..తన భార్య పార్వతికి దక్కేవిధంగా పలుజీవోలు సైతం జారీ చేశారంట. దీన్ని ఒక సామాజిక కార్యకర్త అబ్రహాం.. ఆర్టీఐకు దరఖాస్తు చేసికుని మరో విషయాలన్ని రాబట్టారు. దీనిపై ప్రదీప్ కుమార్, స్నేహమయి కుష్ణ లు ముఖ్యమంత్రిపై విచారణ జరపాలని కూడా ఆగస్టు 16 న గవర్నర్ కు ఫిర్యాదులు చేశారు.
ఈ ఫిర్యాదుల్ని పరిగణ లోనికి తీసుకున్న.. గవర్నర్ థాపర్ చంద్ గహ్లోత్ చర్యలకు ఆదేశించారు. దీంతో సిద్దరామయ్య..దీనిపై మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. గవర్నర్ ఆదేశాలను తోసిపుచ్చారు.
Read more: Pawan kalyan: ఏం తమాశాగా ఉందా..?.. హీరో కార్తీపై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్.. వీడియో ఇదిగో..
అంతేకాకుండా.. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తు.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ఆరాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సీఎం పిటిషన్ ను తోసిపుచ్చింది. ముడా స్కామ్ కేసులో.. సిద్దరామయ్యకు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముడా కుంభకోణం 2010 లో జరిగింది.
సీఎం సిద్దరామయ్య సతీమణి.. పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున స్వామికి బహుమతిగా ఇచ్చిన 3.2 ఎకరాల భూమిఈ కుంభకోణంలో ప్రధానమైన అంశంగా తెలుస్తోంది. ఈ ప్లాట్ లు అసలు భూమి కంటే..చాలా విలువైనదిగా చెప్పారని తెలుస్తోంది. ఈ కుంభ కోణంపై.. అపోసిషన్ నేతలు సైతం మండిపడుతున్నాయి. దీనిలో దాదాపు.. రూ. 3 వేల కోట్ల నుంచి 4 వేల కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని కూడా అపోసిషన్ నేతలు విమర్శిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.