BJP MPS Protest: రాష్ట్రపతిని 'రాష్ట్రపత్ని' అని వ్యాఖ్యానించిన MP అధీర్ రంజన్.. క్షమాపణ చెప్పాలంటూ BJP ఎంపీల నిరసన

BJP MPS Protest: అధికార, విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లింది. అధికార బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు భగ్గమన్నారు. రాష్ట్రపతిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Written by - Srisailam | Last Updated : Jul 28, 2022, 12:12 PM IST
  • పార్లమెంట్ లో బీజేపీ ఎంపీల నిరసన
  • రాష్ట్రపతికి కాంగ్రెస్ క్షమాపణకు డిమాండ్
  • తాను క్షమాపణ చెప్పను- అధీర్ రంజన్
BJP MPS Protest: రాష్ట్రపతిని 'రాష్ట్రపత్ని' అని వ్యాఖ్యానించిన MP అధీర్ రంజన్.. క్షమాపణ చెప్పాలంటూ BJP ఎంపీల నిరసన

BJP MPS Protest: అధికార, విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లింది. అధికార బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు భగ్గమన్నారు. రాష్ట్రపతిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరికి వ్యతిరేకంగా పార్లమెంటులో బీజేపీ మహిళా ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. అధీర్ రంజన్ చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని ఆరోపించారు. ద్రౌపది ముర్ముతో పాటు దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా గిరిజన మహిళను బీజేపీ రాష్ట్రపతి చేస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుందని స్మృతి ఇరానీ మండిపడ్డారు.

బీజేపీ ఎంపీల నిరసనపై  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పారన్నారు.

తాను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ చేస్తున్న డిమాండ్ పై అధీర్ రంజన్ చౌదరి స్పందించారు. తాను క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదన్నారు. నేను పొరపాటున 'రాష్ట్రపత్ని' అని చెప్పాను... అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా కొండపై నుండి పర్వతాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది" అని కాంగ్రెస్ ఎంపీ అధీర్ ఆర్ చౌదరి అన్నారు.

Read also: Komatireddy: అనర్హత వేటు కోసమే సస్పెన్షన్ లేటు? కోమటిరెడ్డి విషయంలో కాంగ్రెస్ పక్కా స్కెచ్?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News