Home Minister Covid-19 test: న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit shah ) కరోనా నుంచి నుంచి కోలుకున్నట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ( Home ministry ) వెంటనే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అమిత్ షాకు ఇప్పటి వరకు కోవిడ్-19 పరీక్షలు చేయలేదని హోం శాఖ స్పష్టం చేసింది. Also read: India: రికార్డు స్థాయిలో కరోనా కేసులు
#COVID19 test of Home Minister Amit Shah has not been conducted so far: Ministry of Home Affairs (MHA) Official https://t.co/8UaeUtNgBp
— ANI (@ANI) August 9, 2020
అమిత్ షాకు ఆగస్టు 2న కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయనకు కోవిడ్-19 పరీక్షలు చేయగా.. నెగెటివ్ వచ్చినట్లు బీజేపీ నేత మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించి.. అమిత్ షాకు ఇంకా కరోనా పరీక్షలు జరగలేదని స్పష్టంచేసింది. అమిత్ షాకు ప్రస్తుతం కరోనా పరీక్షలు జరగలేదని, ఆధారాలు లేని సమాచారాన్ని వ్యాపింపజేయవద్దని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. Also read: Covid-19: మరో ఇద్దరు కేంద్ర మంత్రులకు కరోనా