బీజేపీ ఓ మిలిటెంట్ల సంస్థ: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ పార్టీపై మరోమారు విరుచుకుపడ్డారు. ఆ పార్టీని ఓ మిలిటెంట్ల సంస్థ అని పేర్కొన్నారు.

Last Updated : Jun 21, 2018, 05:59 PM IST
బీజేపీ ఓ మిలిటెంట్ల సంస్థ: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ పార్టీపై మరోమారు విరుచుకుపడ్డారు. ఆ పార్టీని ఓ మిలిటెంట్ల సంస్థ అని పేర్కొన్నారు. దేశంలో ప్రజలను మతాలను బట్టి ఆ పార్టీ విడదీస్తోందని ఆమె ఆరోపించారు. అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తూ ఎక్కువ ఓట్లు బీజేపీ పొందుతుందని ఆమె తెలిపారు. "మాది బీజేపీ పార్టీలా మిలిటెంట్ల పార్టీ కాదు. బీజేపీకి ముస్లిములన్నా, క్రైస్తవులన్నా, సిక్కులన్నా పడదు.

హిందువుల్లో కూడా ఎక్కువ జాతి, తక్కువ జాతి కులాలను వర్గీకరించడమే వారికి పనైపోయింది" అని మమత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. "బీజేపీ హాయాంలో ఎన్ కౌంటర్ల పేరిట భయపించడం అలవాటైపోయింది.

కానీ మా జోలికి వస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది" అని తెలిపారు. అయితే మమత వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రతినిధి దిలీప్ ఘోష్ స్పందించారు. తృణముల్ కాంగ్రెస్ చేసే దాడులను తాము ప్రతిఘటించి తీరుతామని.. ఉపేక్షించమని తెలియజేశారు. 

Trending News