Gang Rape on Monitor Lizard: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ గ్యాంగ్ ఏకంగా 'ఉడుము'పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడింది. జుగుప్సకు, క్రూరత్వానికి పీక్స్ అనిపించేలా ఉన్న ఈ ఘటన మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు ఆ గ్యాంగ్‌ను పట్టుకుని వారి సెల్‌ఫోన్లు చెక్ చేయగా... ఉడుముపై గ్యాంగ్ రేప్ ఉదంతం బయటపడింది.
జంతువులను వేటాడేందుకు ఆ నలుగురి గ్యాంగ్ సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లోకి చొరబడ్డారు. గొథానే అనే గ్రామ సమీపంలో ఉడుమును పట్టుకున్న ఆ గ్యాంగ్... అక్కడే దానిపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆ తతంగాన్ని తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఓ గ్యాంగ్ టైగర్ రిజర్వ్‌లోకి చొరబడినట్లు గుర్తించిన అటవీ అధికారులు... ఎట్టకేలకు వారిని పట్టుకోగలిగారు.
ఆపై ఆ నలుగురి సెల్‌ఫోన్లు పరిశీలించగా ఉడుముపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన దృశ్యాలు అందులో కనిపించాయి. షాక్ తిన్న అధికారులు వెంటనే ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితుల్లో ముగ్గురు కొంకన్ ప్రాంతం నుంచి వచ్చినట్లు గుర్తించారు. బెంగాల్ మానిటర్ లిజర్డ్‌పై వీరు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. నలుగురిని కోర్టు ముందు హాజరపరచనున్నట్లు వెల్లడించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం... నేరం రుజువైతే ఈ నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
గతంలోనూ శునకాలపై, పిల్లులపై కామాంధులు లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. బహుశా ఉడుముపై అత్యాచార ఘటన వెలుగుచూడటం ఇదే తొలిసారేమో. సాధారణంగా ఉడుము రక్తం తాగితే లేదా మాంసం తింటే పలు రకాల వ్యాధులు నయమవుతాయని కొంతమంది నమ్ముతుంటారు. వాటిని అక్రమంగా వేటాడి విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఉడుముపై లైంగిక దాడి వెనక మరేదైనా కోణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటన గురించి తెలిసి ఆ కామాంధులను ఏం చేసినా తప్పు లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Eluru Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు, ఐదుగురి సజీవ దహనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook