Bird flu infection confirmed in Delhi | న్యూఢిల్లీ: కరోనా భయం సమసిపోక ముందే.. దేశంలో మరో మహమ్మారి బర్డ్ ఫ్లూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi ) లో కూడా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి భోపాల్‌కు పంపిన 8 శాంపిళ్లల్లో బర్డ్ ఫ్లూ (Bird flu) పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు.
Bird flu confirmed in Delhi after testing eight samples from dead crows and ducks. All the samples tested positive for avian flu: Animal Husbandry Department, Delhi
— ANI (@ANI) January 11, 2021
మయూర్ విహార్ ఫేజ్-3 లోని పార్క్ నుంచి పంపిన నాలుగు పక్షుల్లో, (crows, ducks) సంజయ్ లేక్‌లోని 3 బాతుల్లో, ద్వారక నుంచి పంపిన ఓ పక్షిలో బర్డ్ ఫ్లూ (avian flu) కనుగొన్నట్లు పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department) విభాగానికి చెందిన డాక్టర్ రాకేశ్ సింగ్ పిటిఐకి తెలియజేశారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో గతవారం రోజులుగా అత్యధిక సంఖ్యలో కాకులు, బాతులు మృతి చెందుతున్నాయి. Also Read: India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా మరణాలు
దీంతో కొన్ని శాంపిల్స్‌ను అధికారులు జలంధర్‌లోని ల్యాబ్‌కు సైతం పంపించారు. వాటి పరీక్షల ఫలితాలు కూడా రావాల్సి ఉంది. ఢిల్లీ పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకూ వందకుపైగా కాకులు, బాతులు మృతి చెందాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) అప్రమత్తమైంది. ఈ మేరకు పార్క్‌లను మూసివేసి హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసింది, ఎక్కడైనా పక్షులు మృతి చెందినట్లు కనిపిస్తే హెల్ప్‌లైన్ నంబరుకు తెలియజేయాలని సూచించింది.
Also read: Covid-19 Vaccine: నేడు సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Bird flu: దేశ రాజధాని ఢిల్లీలో బర్డ్ ఫ్లూ కలకలం.. 8 శాంపిల్స్ పాజిటివ్
కరోనా భయం సమసిపోక ముందే.. దేశంలో మరో మహమ్మారి బర్డ్ ఫ్లూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.