Bharat Ratna: మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం.. అసలు ఆయన ఎవరో తెలుసా?

Karpoori Thakur Bharat Ratna: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్నను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శతజయంతి వేళ ఈ పురస్కారం ప్రకటించడం విశేషం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 23, 2024, 09:18 PM IST
Bharat Ratna: మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం.. అసలు ఆయన ఎవరో తెలుసా?

Bharat Ratna Awarded to Karpoori Thakur: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం పరస్కరించుకుని ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటిస్తూ ఉంటుంది. భారరత్నతోపాటు పద్మ పురస్కారాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద పౌర పురస్కారమైన భారతరత్నను బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్‌కు ప్రకటించింది. ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారతరత్నతో ప్రభుత్వం గౌరవించింది.

కర్పూరి ఠాకూర్‌ ఎవరు?
బిహార్‌కు చెందిన కర్పూరి ఠాకూర్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. సమస్తీపూర్‌ జిల్లాకు చెందిన ఠాకూర్‌ 24 జనవరి 1924న జన్మించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా క్విట్‌ ఇండియా ఉద్యమంలో కర్పూరి పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఆయన జైలుకు కూడా వెళ్లారు. అనంతరం జనతా పార్టీలో చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన కర్పూరి ఠాకూర్‌ డిసెంబర్‌ 1970 నుంచి 1971 వరకు బిహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం రెండోసారి డిసెంబర్‌ 1977 నుంచి ఏప్రిల్‌ 1979 వరకు ముఖ్యమంత్రిగా కర్పూరి ఠాకూర్‌ పని చేశారు. 17 ఫిబ్రవరి 1988న ఆయన తుదిశ్వాస విడిచారు. బిహార్‌లో జనసేత 'జననాయక్‌'గా ఠాకూర్‌ ప్రసిద్ధి చెందారు. తాజాగా భారతరత్న ప్రకటించడంతో బిహార్‌లో సంబరాలు జరిగాయి.

శతజయంతి కానుక
తొలిసారి బిహార్‌ నుంచి కాంగ్రెసేతర వ్యక్తిని భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారం ప్రకటించింది. దీనికితోడు కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించాలని జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ (జేడీయూ), బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తరచూ డిమాండ్‌ చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా వస్తున్న డిమాండ్‌ను కర్పూరి ఠాకూర్‌ శత జయంతి ఉత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. భారతరత్న ప్రకటనపై బిహార్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

Also Read: Free Power from Feb: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News