Defamation Case: మాజీ ప్రధాని దెవెగౌడకు షాక్, బారీ జరిమానా విధించిన బెంగళూరు కోర్టు

Defamation Cas: భారత దేశ మాజీ ప్రధానికి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో జరిమానా విధించింది. సంబంధిత కంపెనీకు 2 కోట్ల రూపాయలు పరువు నష్టంగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2021, 06:04 PM IST
Defamation Case: మాజీ ప్రధాని దెవెగౌడకు షాక్, బారీ జరిమానా విధించిన బెంగళూరు కోర్టు

Defamation Cas: భారత దేశ మాజీ ప్రధానికి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో జరిమానా విధించింది. సంబంధిత కంపెనీకు 2 కోట్ల రూపాయలు పరువు నష్టంగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

భారత మాజీ ప్రదాని హెచ్‌డి దేవెగౌడకు(HD Devegowda) బెంగళూరు హైకోర్టు షాక్ ఇచ్చింది. 2011 జూన్ నెలలో ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్యూలో దేవెగౌడ..నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీపై వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు కోసం అవసరమైన భూమి కంటే ఎక్కువ భూమిని వినియోగించిందని దేవెగౌడ ఆరోపణలు చేశారు.ఈ వ్యవహారంలో తమ పరువుకు భంగం కలిగే వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ దేవెగౌడపై పరువు నష్టం కేసు(Defamation Case) దాఖలు చేసింది.నష్టపరిహారంగా దేవెగౌడ పది కోట్ల రూపాయలు చెల్లించాలని నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ డిమాండ్ చేసింది. దీనిపై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. చివరికి నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చేసిన వ్యాఖ్యల్ని ధృవీకరించడంలో దేవెగౌడ విఫలమయ్యారని కోర్టు తేల్చింది. ఫలితంగా 2 కోట్ల జరిమానా కంపెనీకు చెల్లించాలంటూ బెంగళూరు కోర్టు(Bengaluru Court) కీలక తీర్పు ఇచ్చింది.

Also read: India Corona Cases Updates: దేశంలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు, Covid-19 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News