Congress Twitter Accounts: కాంగ్రెస్ పార్టీకి KGF-2 కాపీ రైట్ యాక్ట్ కష్టాలు.. డేంజర్‌లో ట్విటర్ ఎకౌంట్స్

Congress Party Twitter Accounts: కాపీ రైట్ యాక్టులోని సెక్షన్ 63 ప్రకారం కాపీ రైట్ ఉల్లంఘన కింద ఇది నేరంగా పరిగణించాల్సి ఉంటుందని ఎంఆర్టీ మ్యూజిక్ తమ ఫిర్యాదులో పేర్కొంది. కేజీఎఫ్ 2 ఆడియో హక్కులు కొనుగోలు చేసిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ వద్ద అనుమతి తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆగ్రహం చెందిన ఎంఆర్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. 

Written by - Pavan | Last Updated : Nov 7, 2022, 10:39 PM IST
  • కాంగ్రెస్ పార్టీపై ఎంఆర్టీ మ్యూజిక్ ఫిర్యాదు
  • కాపీ రైట్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఆరోపణ
  • ట్విటర్‌కి బెంగళూరు కోర్టు నోటీసులు
Congress Twitter Accounts: కాంగ్రెస్ పార్టీకి KGF-2 కాపీ రైట్ యాక్ట్ కష్టాలు.. డేంజర్‌లో ట్విటర్ ఎకౌంట్స్

Congress Party Twitter Accounts: కాంగ్రెస్ పార్టీకి కాపీ రైట్ యాక్ట్ కష్టాలొచ్చి పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రమోషన్స్ సందర్భంగా కేజీఎఫ్-2 మూవీకి సంబంధించిన ఆడియో ఉపయోగించారని.. ఇది కాపీ రైట్ యాక్టుకి విరుద్ధం అని ఫిర్యాదు చేస్తూ ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. కేజీఎఫ్-2 మూవీ మ్యూజిక్, ఆడియో రైట్స్ కి తామే పూర్తి హక్కుదారులం అయినందున.. ఆ మ్యూజిక్ ఉపయోగించడానికి ముందుగా తమ అనుమతి తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ.. తమ అనుమతి లేకుండానే మ్యూజిక్ ఉపయోగించినందున కాంగ్రెస్ పార్టీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా బెంగళూరు కోర్టుకు ఫిర్యాదు చేసింది. 

ఎంఆర్టీ మ్యూజిక్ ఇచ్చిన ఫిర్యాదును విచారణను స్వీకరించిన కోర్టు.. కాంగ్రెస్ పార్టీ కాపీ రైట్స్ యాక్టుని ఉల్లంఘించినట్టుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ట్విటర్ అకౌంట్, భారత్ జోడో యాత్ర పేరిట ఉన్న ట్విటర్ ఎకౌంట్స్ పై తాత్కాలికంగా నిషేధం విధించాల్సిందిగా ట్విటర్ సంస్థను ఆదేశించింది. ఇదే ఫిర్యాదుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సుప్రియ శ్రీనాథ్‌పై కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ పోలీసు స్టేషన్‌లో గత వారమే కేసులు నమోదయ్యాయి. 

కాపీ రైట్ యాక్టులోని సెక్షన్ 63 ప్రకారం కాపీ రైట్ ఉల్లంఘన కింద ఇది నేరంగా పరిగణించాల్సి ఉంటుందని ఎంఆర్టీ మ్యూజిక్ తమ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సొంత వీడియోకు కేజీఎఫ్-2 మూవీ మ్యూజిక్ ఉపయోగించుకోవడం ద్వారా ఆ పార్టీ పోస్టు చేసిన వీడియోనే అసలైనదని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసిందని ఎంఆర్టీ ఆరోపించింది.     

భారత్ జోడో యాత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రెండు వీడియోలు పోస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆ రెండు వీడియోలకు కన్నడ నటుడు యశ్ నటించిన కేజీఎఫ్ 2 సినిమా మ్యూజిక్ ఉపయోగించారు. కేజీఎఫ్ 2 ఆడియో హక్కులు కొనుగోలు చేసిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ వద్ద అనుమతి తీసుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆగ్రహం చెందిన ఎంఆర్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. 

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విషయానికొస్తే.. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్రలో ఇప్పటికే ఐదు రాష్ట్రాలు కవర్ అయ్యాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను తాకుతూ వెళ్తున్న భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర ద్వారా ముందుకు సాగిపోనుంది. 150 రోజులపాటు కొనసాగనున్న భారత్ జోడో యాత్ర ( Bharat Jodo Yatra ) జమ్మూకశ్మీర్‌లో ముగియనుంది.

Also Read : Bypoll Results 2022: దేశంలో ఉపఎన్నికల ఫలితాలు, ఏ ఉపఎన్నికలో ఏ పార్టీ విజయం

Also Read : Odisha Bypoll: ఒడిశా ధామ్‌నగర్ ఉపఎన్నికలో గెలిచిన కాంగ్రెస్..నోటాపై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo

Trending News