రోడ్డుపై పడిపోయిన బ్యాలట్ బాక్స్.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్!

రోడ్డుపై పడిపోయిన బ్యాలట్ బాక్స్.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్!

Last Updated : Dec 8, 2018, 06:18 PM IST
రోడ్డుపై పడిపోయిన బ్యాలట్ బాక్స్.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్!

జైపూర్‌ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 7న తెలంగాణతోపాటే రాజస్తాన్‌లోనూ పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికలు ముగిసిన అనంతరం బారన్ జిల్లా కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని షాహబాదా ప్రాంతంలో రోడ్డుపై ఓ బ్యాలెట్‌ బాక్స్‌ పడి వుండటం స్థానికంగా కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఈ బ్యాలెట్ బాక్స్ యూనిట్‌ను రోడ్డుపై పడి వుండటం గమనించిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కిషన్‌గంజ్‌కు చెందిన బ్యాలెట్‌ బాక్స్ యూనిట్‌ను స్ట్రాంగ్‌ రూంకు తరలించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఆలస్యంగా తెలుసుకున్న జిల్లా అధికార యంత్రాంగం.. అందుకు బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు స్పష్టంచేసింది.

 

 

రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం బారన్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌పి సింగ్‌ ఆ బ్యాలెట్ బాక్స్‌పై వున్న నెంబర్ ఆధారంగా.. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, బాక్స్‌ను రోడ్డుపై పడేసుకుని వెళ్లిన ఇద్దరు అధికారులు అబ్దుల్‌ రఫీక్‌, నవల్‌ సింగ్‌ పట్వారీలను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అసలు బ్యాలెట్ బాక్సులకు ఎంతమేరకు రక్షణ ఉందని ఓటర్లకు అనుమానం కలిగేలా చేసిన ఈ ఘటన రాజస్తాన్ రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. 

 

Trending News