న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) పలు దర్యాప్తు బృందాలను నేడు అవంతిపురకు పంపించాయి. పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు, దాడికి పాల్పడిన వైనం, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం ఎన్ఐఏకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించడంలో ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు జమ్ముకాశ్మీర్ పోలీసులకు సహకరించనున్నాయని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది.
పుల్వామ జిల్లాలోని అవంతిపురలో గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి జరిపి నేరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.