ఒక పక్క మత ఘర్షణలు; మరో వైపు హిందూ గర్భిణీని కాపాడిన ముస్లిం యువకుడు

ఒకవైపు మత విద్వేషాలు చెలరేగుతున్నప్పటికీ వాటిని పెట్టి  ఓ హిందూ గర్భిణీని రక్షించిన ముస్లిం యువకుడు

Last Updated : May 16, 2019, 05:22 PM IST
ఒక పక్క మత ఘర్షణలు; మరో వైపు హిందూ గర్భిణీని కాపాడిన ముస్లిం యువకుడు

ఆ ప్రాంతం మతఘర్షణలతో మార్మోగుతుంది. దీంతో అక్కడ యుద్ధప్రాతిపదికన కర్ఫ్యూ విధించారు. ఇదే సమయంలో  ఓ గర్భిణీ పురుటి నెప్పులతో అల్లాడిపోతుంది. ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటో వాలా ఆమెను ఎలా రక్షించాడో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లండి ...

అసోంలోని హిలకండి పట్టణంలో హిందూ - ముస్లింల మత ఘర్షణల చెలరేగుతున్నాయి. ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆందోళన కారులు పలు వాహనాలు, దుకాణాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ యుద్ధ ప్రాతిపదికన కర్ఫ్యూ విధించారు. 

ఇటు వంటి పరిస్థితుల్లో నందిత అనే ఓ హిందూ మహిళ పురిటి నొప్పులతో అల్లాడిపోయింది.  ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ ముస్లిం యువకుడు మక్బూల్‌.. కర్ఫ్యూను కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి తన ఆటోలో ఆమెను ఆస్పత్రికి తరలించి, తల్లీ,బిడ్డ ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు. కాగా ఆమె ప్రస్తుతం  పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు శాంతి అని పేరు పెట్టడం గమనార్హం. కాగా  చుట్టూ ఉన్న వారు మతాల కోసం ఘర్షణ పడుతుంటే ఆ ఆటోడ్రైవర్‌ మాత్రం హిందూ మహిళను సాయం చేసి హీరో అయ్యాడు.

తాజా ఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి జల్లి స్పందిస్తూ  హిందూ-ముస్లిం సామరస్యాన్ని చాటే ఇటువంటి ఉదాహరణలు మరిన్ని వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.  కర్ఫ్యూ ఉన్న సమయంలోనూ సాహసోపేతంగా ఆమెను ఆస్పత్రికి చేర్చిన ఆటోడ్రైవర్‌ మక్బూల్‌ను ప్రత్యేకంగా కలిసి ప్రశంసించారు. 

Trending News