మోడీ ఆలయానికి ప్రధానియా.. భారతావనికా -ఓవైసీ

Last Updated : Dec 15, 2017, 04:51 PM IST
మోడీ ఆలయానికి ప్రధానియా.. భారతావనికా -ఓవైసీ

గుజరాత్ ఎన్నికల సమయంలో ఎంఐఎంను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఓవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ కే సాత్ సబ్ కా వికాస్ అంటున్న మోడీ.. ఒక వర్గానికి కొమ్ముకాసే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు.

గుజరాత్ ఎన్నికల్లో ఎంఐఎం అంశాన్ని ప్రస్తావించి మోడీ మోడీ తన వైఖరి మందిరం వైపో..మసీదు వైపో చెప్పాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ..ఈ అంశంపై సమాధానం చెప్పాల్సింది తాను కాదని...ప్రధాని హోదాలో ఉంటూ ఓ వర్గానికి చెందిన వ్యక్తిలా మాట్లాడే మోడీ సమాధానం చెప్పాలన్నారు.  మోడీ మందిరానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారా..భారతావనికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారా? బహిరంగంగా చెప్పాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అనుసరిస్తున్న వైఖరితో పాటు వ్యాఖ్యానిస్తున్న తీరు దేశ సెక్యూలరిజాన్ని దెబ్బతీసేలా ఉందని మండిపడ్డారు .

గుజరాత్ పోరులో పాక్ ప్రమేయాన్ని నిరూపించాలి...

గుజరాత్ ఎన్నికల్లో పాక్ హస్తముందని.. పాక్‌తో కొందరు కుమ్మకయ్యారని ఆరోపణలు చేయడం మోడీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యింది ఎవరో ఇప్పటి వరకు చెప్పలేకపోయారని వెల్లడించారు. ఎవరో పాకిస్తాన్‌తో కుమ్మకయ్యారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు... అదే నిజమైతే ఆ ఆరోపణను నిరూపించాలని ఈ సందర్భంగా ఓవైసీ ఛాలెంజ్ చేశారు. ఎన్నికల తర్వాత గుజరాత్‌లో బీజేపీ నామ రూపాల్లేకుండా పోతుందని ఓవైసీ జోస్యం చెప్పారు.

Trending News