కర్ణాటక ఎన్నికలు: ఓటర్లకు పంపిణీ కోసం తెచ్చిన రూ.120 కోట్ల డబ్బు, వస్తువులు సీజ్

కర్ణాటక ఎన్నికల తేది సమీపిస్తున్న క్రమంలో పలు పార్టీలు ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం కోసం ఇప్పటికే పథకాలు రచించాయి. ఇందులో భాగంగానే డబ్బుతో పాటు మద్యం ఆశచూపి ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు పలు పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

Last Updated : May 5, 2018, 09:41 PM IST
కర్ణాటక ఎన్నికలు: ఓటర్లకు పంపిణీ కోసం తెచ్చిన రూ.120 కోట్ల డబ్బు, వస్తువులు సీజ్

కర్ణాటక ఎన్నికల తేది సమీపిస్తున్న క్రమంలో పలు పార్టీలు ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం కోసం ఇప్పటికే పథకాలు రచించాయి. ఇందులో భాగంగానే డబ్బుతో పాటు మద్యం ఆశచూపి ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు పలు పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అలాగే మహిళలకు కుక్కర్లు, చీరలు, కుట్టు మిషన్లు.. విద్యార్థులకు సైకిళ్లు, లాప్ ట్యాపులు ఇవ్వడానికి కూడా అభ్యర్థులు రెడీ అవుతున్నారు.

అయితే ఈ సమాచారం ఇప్పటికే ఎన్నికల కమీషనుకి చేరడంతో వారు సర్వైలెన్స్ టీములను ఏర్పాటు చేశారు. అనుమానిత నియోజకవర్గాల్లో నిఘాను కూడా పటిష్టం చేశారు. ఈ క్రమంలో పలు చోట్ల దాడులు కూడా చేసి, సరైన లెక్కలు, ఆధారాలు చూపించని రాజకీయ కార్యకర్తల నుండి భారీ ఎత్తున డబ్బు, వస్తువులు సీజ్ చేశారు. వాటి విలువ రూ.120 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. 

ఈ దాడుల్లో రూ.67.27 కోట్లు నగదు లభించగా, రూ.23.36 కోట్ల విలువ చేసే అయిదు లక్షల లీటర్ల మద్యం లభించడం గమనార్హం. అలాగే రూ.32.54 కోట్ల విలువ గల బంగారు ఆభరణాలు, రూ.39.80 లక్షల రూపాయల విలువ చేసే నార్కోటిక్స్ కూడా దొరకడంతో విస్తుపోవడం అధికారుల వంతైంది. ఈ దాడులు నిర్వహించిన సర్వైలెన్స్ టీమ్స్‌లో పోలీస్ శాఖతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా ఉన్నారు.

పలు నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల కార్యాలయాలతో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తల ఇళ్లల్లో దాడులు నిర్వహించి డబ్బుతో పాటు విలువైన వస్తువులు, బంగారం, మద్యం సీసాలను సీజ్ చేశారు అధికారులు

Trending News