Maharashtra Nurse Rape Case: ఒక ఘటన మరువక ముందే మరొక ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆర్ జీ కర్ ఘటన మరువకముందే ఇప్పుడు నర్సింగ్ విద్యార్థినీ పై జరిగిన దాడి అందరిలో భయాందోళనకు గురిచేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. మహారాష్ట్రలోని రత్నగిరిలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. చెంపక్ గ్రౌండ్ సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించింది నర్సింగ్ విద్యార్థి. తీవ్రంగా గాయపడిన ఆమెను చూసిన స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ విద్యార్థినికి జరిగిన గాయాలు చూసి క్రూరమైన లైంగిక వేధింపు లేదా అత్యాచారానికి సంబంధించిన అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఘటన రత్నగిరి లోని నర్సింగ్ వర్గాలలో కలకలం రేపింది. నేరానికి పాల్పడిన దుండగులకు ఏకంగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి సిబ్బంది మరియు నర్సులు ఆసుపత్రి వెలుపల నిరసనలు చేపట్టారు. రత్నగిరిలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ను అడ్డుకోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఇతర మద్దతుదారులతో కలిసి వీధిలోకి రావడంతో నిరసనలు మరింత తీవ్రతరం అయ్యాయి.
బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. బ్యానర్లు పట్టుకొని మరీ నినాదాలు చేశారు. ఈ పరిస్థితి రత్నగిరి నగరంలో ఘననీయమైన విఘాతం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తుకు ప్రాధాన్య ఇస్తున్నట్లు అధికారులు హామీ ఇస్తూ.. శాంతిభద్రతలు కోరుతున్నారు.
నిందితులను అరెస్టు చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని పలువురు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా పని ప్రదేశాలలో మహిళల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇకపోతే RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఆగస్టు 9వ తేదీన అత్యాచార మరియు హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ కు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా లేట్ షిఫ్టుల సమయంలో వారి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. మరి ప్రభుత్వాలు పోలీసులు, అధికారులు మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Also read: September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook