Bipin Rawat: అఫ్గానిస్థాన్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు వలసలు పెరిగే అవకాశం

Afghanistan situation overflow can happen: సరిహద్దుల్ని మూసివేయాల్సి రావొచ్చని ఆయన తెలిపారు. ముమ్మర తనిఖీలు అవసరమని జనరల్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. బయటి నుంచి ఎవరు వస్తున్నారో నిఘా ఉంచాలన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 01:58 PM IST
  • అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు వలసలు పెరిగే అవకాశం
  • సరిహద్దుల్ని మూసివేయాల్సి రావొచ్చు
  • భారత్‌-చైనా మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం
  • త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌
Bipin Rawat: అఫ్గానిస్థాన్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు వలసలు పెరిగే అవకాశం

Afghanistan situation overflow can happen in Jammu and Kashmir: CDS Bipin Rawat: అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు వలసలు పెరిగే అవకాశం ఉందని త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ Chief of Defence Staff General (CDS) బిపిన్‌ రావత్‌ (Bipin Rawat) అన్నారు. దీనికి భారత్‌ సిద్ధంగా ఉండాల్సిన అసవరం ఉందన్నారు. సరిహద్దుల్ని మూసివేయాల్సి రావొచ్చని ఆయన తెలిపారు. ముమ్మర తనిఖీలు అవసరమని జనరల్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. బయటి నుంచి ఎవరు వస్తున్నారో నిఘా ఉంచాలన్నారు. దేశ భద్రత ప్రతిఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు బిపిన్‌ రావత్‌ (Bipin Rawat). అలాగే దేశంలో అంతర్గతంగానూ శాంతిభద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక భారత్‌-చైనా (India - China) మధ్య అనేక అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలన్నింటినీ ఒకేలా చూడాలన్నారు. లద్దాఖ్‌, ఈశాన్య ప్రాంతంలోని సమస్యల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు.

Also Read : Nivetha Thomas: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన వకీల్ సాబ్ భామ

2020లో ఇరుదేశాల మధ్య సమస్యలు నెలకొన్నాయన్నారు. అవన్నీ చర్చల ద్వారా సద్దుమణుగుతున్నాయని చెప్పుకొచ్చారు. సైనిక, దౌత్య, ప్రభుత్వాల స్థాయిలో చర్చలు సాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుత వివాదాలన్నింటినీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని.. అవన్నీ పరిష్కారం అవుతాయని భారత్‌ (India) విశ్వసిస్తోంది. 

గత ఏడాది తూర్పు లద్దాఖ్‌లో దురాక్రమణలకు పాల్పడ్డ చైనా.. గల్వాన్‌ ఘర్షణలో తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య వివిధ స్థాయిల్లో పలు దఫాలు జరిగిన చర్చల ఫలితంగా కొన్ని నెలల పాటు ఇరు దేశాల సైన్యాలు కీలక వివాదాస్పద ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గాయి. కానీ, చైనా  (China) మాత్రం వక్రబుద్ధిని చాటుతూ సరిహద్దు వెంట వివిధ ప్రాంతాల్లో సైన్యాన్ని (Army) మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

Also Read : Tamannaah : తనని ఆ షో నుంచి తొలగించడంపై తమన్నా సీరియస్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News