నేడు శాసనసభాపక్ష నాయకుని ఎన్నిక

దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది.. ఆమ్ ఆద్మీ పార్టీ.  ఢిల్లీలో మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఎన్నికల్లో 62 స్థానాలు కైవశం చేసుకుని ..  ప్రతిపక్ష పార్టీలకు కనీసం అందనంత దూరంలో కూడా దొరకకుండా విజయతీరాలకు చేరుకుంది.

Last Updated : Feb 12, 2020, 09:42 AM IST
నేడు శాసనసభాపక్ష నాయకుని ఎన్నిక

దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది.. ఆమ్ ఆద్మీ పార్టీ.  ఢిల్లీలో మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఎన్నికల్లో 62 స్థానాలు కైవశం చేసుకుని ..  ప్రతిపక్ష పార్టీలకు కనీసం అందనంత దూరంలో కూడా దొరకకుండా విజయతీరాలకు చేరుకుంది.  విజయోత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ .. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వడవడిగా అడుగులు వేస్తోంది. 

ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు శాసన సభా పక్ష నాయకున్ని ఎన్నుకోనుంది. అందుకోసం ఇవాళ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా సమావేశం కానున్నారు.  ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలో ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. అక్కడ అందరూ ఏకగ్రీవంగా కొత్త శాసన సభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. సాధారణంగా మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌నే అంతా లెజిస్లేచర్ లీడర్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్టీ నిర్ణయాన్ని, సంఖ్యా బలాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ రూపంలో అందిస్తారు. ఆ తర్వాత తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.

మరోవైపు ముచ్చటగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అది ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో నిర్ణీతమవుతుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరేందుకు తేదీలను ఇంకా ధృవీకరించలేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీల కోసం ఫిబ్రవరి 14 నుంచి 16 మధ్య తేదీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లోనే ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండాలని కోరుతున్నారు.

Trending News