Aadhaar Card Update: ఆధార్‌లో కీలక మార్పులు.. ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా..?

How Many Times can Change Aadhaar Data: ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా..? తప్పులు సరిదిద్దినా మళ్లీ మిస్టేక్స్ జరుగుతున్నాయా..? మీ ఆధార్ కార్డును ప్రతిసార అప్‌డేట్ చేయాలంటే కుదరదు. ఇందుకు UIDAI కొన్ని పరిమితులు విధించింది. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 12:29 PM IST
Aadhaar Card Update: ఆధార్‌లో కీలక మార్పులు.. ఎన్నిసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా..?

How Many Times can Change Aadhaar Data: ప్రస్తుతం మన దేశంలో ఆధార్ కార్డు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో ప్రతి పనికీ ఆధార్ కావాల్సిందే. ఆధార్ కార్డులేనిదే ఏ ప్రభుత్వ పథకం కూడా అందదు. సిమ్ కార్డు కూడా తీసుకోలేం. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇంత ముఖ్యమైన కార్డులో తప్పుల్లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ వివరాలలో పొరపాటు ఉంటే.. వెంటనే సరిదిద్దుకోండి. అయితే మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, లింగాన్ని ఎన్నిసార్లు మార్చవచ్చో మీకు తెలుసా.. భద్రతా సమస్యల కారణంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. 

==>> ఆధార్ కార్డులో మీ పేరును రెండుసార్లు ప్రారంభించవచ్చు. 
==>> మీ పుట్టిన తేదీని మీరు ఎప్పటికీ మార్చలేరు. అయితే డేటా ఎంట్రీ సమయంలో చేసిన పొరపాటును సరిదిద్దుకోవచ్చు. 
==>> మీరు ఆధార్‌లో మీ లింగాన్ని ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. 
==>> UIDAI ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి.. ఆధార్ పేరు, లింగం, పుట్టిన తేదీని మళ్లీ మార్చుకోవచ్చు. 
==>> మొబైల్ నంబర్, ఈ-మెయిల్, ఫోటోను కూడా మార్చడానికి పరిమితి లేదు. 
==>> నిర్దిష్ట కాలపరిమితి కంటే ఎక్కువ మీరు ఆధార్‌లో పేరు, లింగం, పుట్టిన తేదీని మార్చలేరని UIDAI సమాచారం తెలిపింది. 

ఆధార్ అప్‌డేట్ కోసం ఈ పద్ధతులు ఫాలో అవ్వండి..
 
==>> UIDAI అధికారిక వెబ్‌సైట్‌ uidai.gov.in ను సందర్శించండి. 
==>> 'అప్‌డేట్ ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==>> ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి.. అవసరమైన వివరాలను పూరించండి.
==>> ఫారమ్‌ను సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో సమర్పించండి.
==>> ఆధార్ సెంటర్‌లోని ఉద్యోగి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా అన్ని వివరాలను ధృవీకరిస్తారు.
==>> ఈ సమయంలో మీ ఆధార్‌లోని అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. 
==>> మీ కొత్త ఫోటో తీసుకుని.. వివరాలను అప్‌డేట్ చేస్తారు.
==>> ఫీజు రూ.100తో పాటు జీఎస్టీ చెల్లించాలి.
==>> ఆధార్ ఉద్యోగి మీకు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్, అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఇస్తారు.
==>> 90 రోజుల్లో మీ ఫోటోతోపాటు వివరాలు అప్‌డేట్ అవుతాయి. 

Also Read: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో మరింత పవర్‌ఫుల్   

Also Read: Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News