Pumped Air Into Rectum: యజమాని క్రూరత్వం.. దారుణస్థితిలో ఉద్యోగి మృతి

Pumped Air Into Rectum: కొన్ని సంస్థల యాజమాన్యాలు, బాస్‌లు తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, పనివారిపై ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో తాజాగా జరిగిన సంఘటనే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్‌లో ఓ ఉద్యోగిని అతడి యజమాని క్రూరంగా హింసించడంతో అతడు దారుణమైన స్థితిలో మరణించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2020, 04:33 PM IST
  • కొందరు యజమానులు ఉద్యోగులు, పనివారిపై క్రూరత్వం ప్రదర్శిస్తారు
  • మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన అందుకు నిదర్శనమని చెప్పవచ్చు
  • ఓ యజమాని క్రూర్వత్వానికి ఏకంగా ప్రాణమే పోవడంతో షాక్
Pumped Air Into Rectum: యజమాని క్రూరత్వం.. దారుణస్థితిలో ఉద్యోగి మృతి

Pumped Air Into Rectum: కొన్ని సంస్థల యాజమాన్యాలు, బాస్‌లు తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, పనివారిపై ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో తాజాగా జరిగిన సంఘటనే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్‌లో ఓ ఉద్యోగిని అతడి యజమాని క్రూరంగా హింసించడంతో అతడు దారుణమైన స్థితిలో మరణించాడు. అయితే ఈ ఘటన నెలన్నర తర్వాత ఆలస్యంగా వెలుగు చూసింది.

మధ్యప్రదేశ్(Madhya Pradesh) శివపురిలోని గోవర్ధన్ ప్రాంతంలో ఓ వ్యక్తి రోజులాగే నవంబర్ 8న (నెలన్నర రోజుల కిందట) పనికి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, అతడు అస్వస్థతకు లోనయ్యాడని ఆసుపత్రిలో చేర్పించారని ఎస్పీ తెలిపారు. బాధితుడి సోదరుడి వద్దకు ఓ వ్యక్తి వచ్చి, మీ సోదరుడికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారని చెప్పాడు.

Also Read: Telangana: కరోనా సెకండ్ వేవ్.. జర జాగ్రత్త!: ఈటల రాజేందర్

 

బాధితుడి సోదరుడు ఆస్పత్రికి వెళ్లేసరికి ఆ ఉద్యోగి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఉదయం బాగానే ఉన్నావు.. అంతలోనే ఏమైందని బాధితుడిని అతడి సోదరుడు అడిగాడు. తన యజమాని, మరికొందరు వ్యక్తులు కలిసి తన మలద్వారంలో కంప్రెషర్‌తో ఎయిర్ పంపు చేయడంతో కడుపునొప్పి వచ్చిందని చెప్పినట్లు వివరించారు.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

 

అయితే ఎన్ని ఆస్పత్రులు మారినా ప్రయోజనం లేకపోయింది. ఆ ఉద్యోగి చనిపోయాడని ఎస్పీ తెలిపారు. అయితే ఆ విషయం తమకు ఇప్పుడు తెలియడంతో కేసు నమోదుచేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణంపై తమకు ఏ ఫిర్యాదు అందలేదని, అందుకే విషయం ఆలస్యంగా వెలుగుచూసిందన్నారు. విచారణ చేపట్టిన అనంతరం దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News