ఎమర్జెన్సీ ల్యాండింగ్: అయినా దక్కని చిన్నారి ప్రాణాలు

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ అయింది.

Last Updated : Aug 1, 2018, 02:23 PM IST
ఎమర్జెన్సీ ల్యాండింగ్: అయినా దక్కని చిన్నారి ప్రాణాలు

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ అయింది. బెంగళూరు నుండి పాట్నాకు వెళతున్న ఇండిగో విమానం 6E 897లో నాలుగు నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో మంగళవారం ఇండిగో విమానాన్ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన చిన్నారిని అపోలో ఆస్పత్రికెళ్లి చికిత్స చేశారు. అయినా చిన్నారి ప్రాణాలు దక్కలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరమున్నీరయ్యారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు సెక్షన్ 174 కింద కేసు రిజిస్టర్ చేసుకొని విచారణ చేపట్టారు. '6E 897 ఇండిగో విమానం బెంగళూరు నుండి పాట్నా వెళుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది' అని పీటీఐ తన కథనంలో పేర్కొంది. 'వైద్యుడుతో కూడిన విమాన సిబ్బంది శిశువుకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేసి ఇండిగో సిబ్బంది అపోలో ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, చిన్నారి మరణించింది' అని పీటీఐ తెలిపింది. చిన్నారి మృతిపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేసింది.

Trending News