8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి ఉద్యోగవర్గాల్లో ఒకటే చర్చ కన్పిస్తోంది. జీతభత్యాలు ఏ మేరకు పెరుగుతున్నాయి, డీఏ ఎంత పెరుగుతుంది, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, గ్రాట్యుటీ ఇంకా ఇతరత్రా ఏయే ప్రయోజనాలు కలగనున్నాయని చర్చించుకుంటున్నారు. అన్నంటికంటే ముఖ్యంగా జీతాలపై గణనీయమైన ప్రభావం కన్పించనుంది.
కొత్త వేతన సంఘం ఏర్పడినప్పుడు ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు సమీక్షించడంతో కీలకపాత్ర పోషించేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం అవడంతో అప్పట్లో ఉద్యోగుల కనీస వేతనం 7 వేల రూపాయల నుంచి 18 వేలకు పెరిగింది. అంటే ఏకంగా నెలకు 12 వేలు జీతం పెరిగింది.
ఇప్పుడు అందుకే 8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న 7వ వేతనం సంఘం 2026తో ముగుస్తుంది. ఆ తరువాత కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుంది. అప్పుడు ఉద్యోగుల జీతభత్యాల్లో ఎలాంటి మార్పు ఉంటుంది, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటంది, డీఏ ఏ మేరకు పెరుగుతుందనే చర్చ కన్పిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగుల చూపు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్‌పై ఉంటుంది. ఎందుకంటే దీనిని బట్టే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ ఎంత పెరుగుతాయనేది నిర్ణయిస్తారు. ద్రవ్యోల్బణం నేపధ్యంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకంగా మారుతుంది. జీతం ఎంత పెరుగుతుందనేది 8వ వేతన సంఘం సమయంలోనే తెలుస్తుంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎందుకు ముఖ్యం
ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పెంపులో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకం. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 శాతంగా నిర్ణయించడంతో కనీస వేతనం 7 వేల రూపాయల నుంచి ఒకేసారి 18 వేల రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు కూడా అదే విధంగా కనీస వేతనం భారీగా పెరగవచ్చని అంచనా. 7వ వేతన సంఘం ఏర్పడిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెరిగింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లు అవడంతో కనీస వేతనం 18 వేల రూపాయలకు చేరుకుంది. ఈసారి కూడా అదే పద్ధతి అవలంబిస్తే కచ్చితంగా ఉద్యోగుల కనీస వేతనం 26 వేలకు చేరవచ్చు.
4వ వేతన సంఘం సమయంలో ఉద్యోగుల కనీస వేతనం 27.6 శాతం పెరిగి 750 రూపాయలైంది. ఆ తరువాత 5 వేతన సంఘం ఏర్పడినప్పుడు ఉద్యోగులు జాక్‌పాట్ తగిలింది. కనీస వేతనం ఒకేసారి 2250 రూపాయలైంది. ఇక 6వ వేతన సంఘం సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86 రెట్లు కావడంతో కనీస వేతనం ఒకేసారి 54 శాతం పెరిగింది. దాంతో జీతం 7 వేలకు చేరింది. ఆ తరువాత 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లు అవడంతో కనీస వేతనం 18 వేలు చేరింది.
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే వేతన సమక్ష పాత పద్ధతిలోనే ఉండవచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు పెరగవచ్చని అంచనా. అదే జరిగితే కనీస వేతనం 44 శాతం పెరిగి 26 వేలు చేరవచ్చు. ఇటీవలే కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడిక కమిటీ ఏర్పాటు, ఇతర అనుమతులు పొందాల్సి ఉంటుంది. 2026లో కొత్త వేతన సంఘం ఏర్పడవచ్చని అంచనా ఉంది.
Also read: 8th Pay Commission DA Updates: డీఏపై వేతన సంఘం ప్రభావం, భారీగా పెరగనున్న కనీన వేతనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి