80 కోట్ల మంది భారతీయులకు ఫ్రీ రేషన్ పంపిణీ: పీఎంజికెఏవై లబ్ధిదారులతో ప్రధాని మోదీ

Free ration during coronavirus pandemic: PM Modi న్యూ ఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి వ్యాపించడం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 80 కోట్ల వరకు మందికి ఉచిత రేషన్ పంపిణీ చేయడం జరిగింది అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం సంబంధించి మధ్యప్రదేశ్‌కి చెందిన లబ్ధిదారులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించిన ప్రధాని మోదీ.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2021, 07:01 AM IST
80 కోట్ల మంది భారతీయులకు ఫ్రీ రేషన్ పంపిణీ: పీఎంజికెఏవై లబ్ధిదారులతో ప్రధాని మోదీ

Free ration during coronavirus pandemic: PM Modi న్యూ ఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి వ్యాపించడం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 80 కోట్ల వరకు మందికి ఉచిత రేషన్ పంపిణీ చేయడం జరిగింది అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం సంబంధించి మధ్యప్రదేశ్‌కి చెందిన లబ్ధిదారులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించిన ప్రధాని మోదీ.. అందులో ఒక్క మధ్యప్రదేశ్‌ నుంచే 5 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్టు తెలిపారు. కరోనావైరస్ మహమ్మారిని గత 100 ఏళ్లలో అతి పెద్ధ ఘోర విపత్తుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టన్స్ (wearing masks, sanitize hands and maintain social distancing) పాటించడం వంటి నివారణ చర్యలతోనే కరోనావైరస్‌ను పారదోలగలం అని స్పష్టంచేశారు.

కరోనావైరస్ సంక్షోభంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకే కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (PMGKAY) కావొచ్చు లేదా ప్రధాన్ మంత్రి రోజ్‌గార్ యోజన పథకం (PMRY) కావొచ్చు.. లబ్ధిదారులకు ఆహారభద్రత, ఉపాధి గురించే ఎక్కువగా ఆలోచించాం అని అన్నారు. 

Also read : Night curfew in Karnataka: కర్ణాటకలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, నైట్ కర్ఫ్యూ వేళల్లో మార్పులు

వోకల్ ఫర్ లోకల్ (Vocal for local) నినాదం గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పండగల సమయంలో హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని భారతీయులకు సూచించారు. అలా చేయడం వల్ల వారికి సహకరించట్టు కూడా అవుతుంది అని ప్రధాని మోదీ (PM Narendra Modi) అభిప్రాయపడ్డారు.

Also read : Johnson and Johnsonజాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ షాట్ వ్యాక్సిన్‌కు ఇండియాలో అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News