7th Pay Commission Latest Pending DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందే అవకాశం కనిపిస్తోంది. కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల డీఏ బకాయి కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా 18 నెలల పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది హోలీ తర్వాత ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. హోలీ గిఫ్ట్‌గా ఉద్యోగులు, లక్షలాది మంది పెన్షనర్లకు పెండింగ్ డీఏ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా జూలై 2020 నుంచి 18 నెలల వరకు మూడు విడతల డీఏ బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జూలై 2021లో ప్రభుత్వం డీఏని పునరుద్ధరించింది. అయితే 18 నెలలుగా చెల్లించని మూడు చెల్లింపుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ విషయంపై క్యాబినెట్ సెక్రటరీకి జేసీఎం కార్యదర్శి లేఖ రాశారు. పెండింగ్ డీఏ బకాయిలపై చర్చించడానికి ఆయన సమయం కోరారు. పెండింగ్ డీఏ పొందడం ఉద్యోగుల హక్కు కాదా..? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే.. వారి ఖాతాలోకి భారీగానే చేరే అవకాశం ఉంది. లెవెల్-3లో ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య ఉండవచ్చని అంచనా. అదేవిధంగా లెవల్-13 లేదా లెవల్-14 ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు ఉండవచ్చు. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకోగా.. చివరికి నిరాశే ఎదురైంది.
7వ వేతన సంఘం కింద ఈ ఏడాదికి సంబంధించిన డీఏ పెంపు ప్రకటన మార్చి నెలలో వచ్చే అవకాశం ఉంది. ఈసారి నాలుగు శాతం డీఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)ని కూడా పెంచనుంది. అదేవిధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా మార్చాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2024కి ముందే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని.. ఇందుకు సబంధించిన ప్రకటన కూడా త్వరలో వస్తుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే.. కేంద్ర ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది.
Also Read: Hindenburg vs Adani: సర్వత్రా ఉత్కంఠ.. అదానీ వ్యవహారంపై నేడు సుప్రీంలో విచారణ
Also Read: North Korea Military Parade: ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి